Tuesday, September 17, 2024

TG: మున్నేరు వంతెనపై భారీ వాహనాలకు బ్రేక్…

మున్నేరుపై ఉన్న పాత వంతెనపై నుంచి భారీ వాహనాలు, బస్సుల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. మున్నేరు వంతెనపై భారీ వాహనాలు, బస్సులు, స్కూల్ బస్ లు, డీసీఎంల రాకపోకలు నిషేధించినట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం రూరల్ మండలంలోని జలగంనగర్-ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతాల మధ్య మున్నేరు వంతెన పక్కనే తీగల వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

పనులకు భారీ వాహనాలు, బస్సుల రాకపోకల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు వాటి రాకపోకలను నిలిపివేస్తూ నాయుడుపేట, బైపాస్ రోడ్డు, ఖమ్మం కాల్వొడ్డు ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement