Friday, November 22, 2024

KNR: వేములవాడలో బ్రేక్ దర్శనాలు…

ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు
.. నేటి నుండి అమలు

రాజన్న జిల్లా, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం సోమవారం బ్రేక్ దర్శనాలు ప్రారంభించారు. ఇక్కడ శివుడు రాజరాజేశ్వరుడిగా భక్తులకు దర్శనం ఇస్తారు. సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. శ్రావణ మాసం, కార్తీక మాసం, శివరాత్రి సమయంలో ఇసుకవేస్తే రాలనంత జనం ఉంటారు.

ఆ పరమశివుడిని దర్శించుకొని భక్తులు తరిస్తుంటారు. ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. వేములవాడలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే వీటీఏడీఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. బ్రేక్ దర్శన టికెట్ అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

ఇందుకోసం ప్రతిపాదనలను దేవదాయశాఖ కమిషనర్‌కు పంపించారు. ఆమోదం తెలుపడంతో సోమవారం 300 రూపాయల టికెట్ తో బ్రేక్ దర్శనం ప్రారంభమైంది. బ్రేక్ దర్శనం కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం బ్రేకదర్శనాల కోసం రెండు పూటల గంట పాటు సమయం కేటాయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement