సీఎం రేవంత్‌రెడ్డి సంకేతాలు
రూట్ మార్చి ఫలకనామా నుంచి శంషాబాద్‌కు రెండో దశ మెట్రో నిర్మాణం
త్వరలో రానున్న స్పష్టత
హైదరాబాద్ మెట్రోను రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు విస్తరించాలన్న ప్రాజెక్టుకు బ్రేకులు పడనున్నాయా? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. నెహ్రు ఔటర్ రింగ్ రోడ్ వెంట రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు చేపట్టనున్న మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు పనులకు తాత్కాలిక బ్రేక్ పడే అవకాశాలున్నాయి.
ఇదివరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ కొత్త ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలనిప్రతిపాదించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మెట్రో రెండో దశ నిర్మాణానికి సంబంధించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాకే ఒక స్పష్టతకు రావాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు చెబు తున్నారు. కొందరు పేరొందిన స్థిరాస్థి వ్యాపారులకు భారీగా ప్రయోజనం చేకూర్చేందుకే కేసీఆర్ ప్రభుత్వం ఆదరా బాదరాగా ఈ ప్రాజెక్టును మంత్రిమండలి ముందుంచి ఆమోదించిదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం సచివాలయంలో రేవంత్ మజ్లిస్ ఎమ్మెల్యేలతో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ముందు నిర్వహిచిన సన్నాహక సమావేశంలో హెచ్‌ఎండీఏ కార్యకలాపాలకు సంబంధించి తన కార్యాలయ అధికారులతో ఆరా తీ యగా మెట్రో రైలు రెండో దశ నిర్మాణ పనులకు సంబంధించిన అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం. దీంతో స్పందించిన సీఎం కొంతమంది రియల్టర్లకు మే లు చేసేలా ప్లాన్ చేశారన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని మైండ్ స్పేస్ (రాయదుర్గం) నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రోను అనుసంధించాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వం ప్రతి పాదించిన రాయదుర్గం- శంషాబాద్ ప్లాన్‌కు బ్రేకులు పడే అవకాశాలు కని పిస్తున్నాయి. దానికి బదులుగా ఓల్డ్ సిటీని అనుసంధానిస్తూ శంషాబాద్ ఎ యిర్‌పోర్టుకు మెట్రోను విస్తరించే ప్లాన్‌లో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు సమా చారం. జేబీఎస్- ఫలక్‌నుమా కారిడార్ పూర్తి చేసి పహాడీ షరీఫ్ మీదుగా ఎ యిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరించే ప్రణాళిక సీఎం రేవంత్ మదిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు లక్డీకాపూల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య మరో లైన్ నిర్మించే అవకాశాలున్నాయి. ఈ ప్లాన్‌లో ఓల్డ్ సిటీలోని మెజార్టీ ప్రాంతాలతో పాటు టెక్ కారిడార్‌లోని పలు ప్రాంతాలను కవర్ చేసే అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమావేశమవుతూ మూసీ నది ప్రక్షాళన హైదరాబాద్ పాత నగరం అభివృద్ధిపై మంగళవారం ఎంఐఎం ఎమ్మె ల్యేలతో సీఎం రేవంత్ సమావేశమైన సందర్భంగా మెట్రో నిర్మాణంపై ఆయన పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఐటీ కారిడార్, శంషాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు, వారి బంధువులకు ఎక్కువగా ఏ రూట్ ఉప యోగపడుతుందో చూడాలని ఆయన అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ- ప్రైవేట్ విధానంలో నిర్మించేందుకు గత ప్ర భుత్వం ఒప్పందం చేసుకుంది. రూ.7 వేల కోట్లు ప్రాజెక్టు కోసం టెండర్లు పిలవగా.. ఎల్ అండ్ టీ కాంట్రాక్టును దక్కించుకుంది. హైదరాబాద్ మైండ్‌స్పేస్ జంక్షన్ నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కి.మీ పొడవున మెట్రో నిర్మిం చాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు రూ. 6,250 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. మూడేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని గత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రైలు నిర్మాణ పనులు పూర్తయితే రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కేవలం 26 నిమిషాల్లో చేరుకోవచ్చని మెట్రో అధికారులు చెబుతున్నారు. అధునాతన టెక్నాలజీ ఉపయోగించుకుని ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేలా ఈ మెట్రో ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదిం చారు. ఇప్పటికే నగరంలో తిరుగుతున్న మెట్రో ట్రైన్లు, మెట్రో స్టేషన్లకు మించి అత్యాధునిక హంగులతో ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు.
ప్రతిపాదిత మెట్రో రూటు ఇదే..
రాయదుర్గం సర్వే నంబర్-83కి చేరువలోనే ఉన్న రాయదుర్గం మెట్రో రైల్వేస్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు విస్తరిస్తారు. ముఖ్యంగా బయోడైవర్సిటీ పార్కు కూడలి చేరువ నుంచి మధురానగర్, ఖాజాగూడ, నానక్‌రాంగూడ, ఓఆర్‌ఆర్ అండర్ బ్రిడ్జి పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డు ద్వారా నార్సింగి మీదుగా శంషాబాద్ వరకు మెట్రో రైలు నడపాలని భావిస్తున్నారు. ఈ మెట్రోతో గచ్చిబౌలి, మధురానగర్, రాయదుర్గం, ప్రశాంత్ హిల్స్, ఖాజాగూడ, సాయివైభవ్ కాలనీ, సాయి ఐశ్వర్య కాలనీ, ల్యాంకో హిల్స్, నానక్‌రాంగూడ పరిసరాల్లోని వారికి మేలు కలుగుతుంది. ఇటీవల ఈ ప్రాంతాలలో గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లు విరివిగా పెరగడం, ఇంకా పలు భవనాలు నిర్మాణంలో ఉండడంతో వీరంతా సంతోషిస్తున్నారు.
ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలలోని ఐటీ, ఇతర సంస్థల ఉద్యోగులు కూడా మెట్రో రాకతో సొంత వాహనాలు పక్కనపెట్టి మెట్రోలోనే రాకపోకలు సాగించే అవకాశం ఉంది.