Friday, November 22, 2024

ఫార్ములా ఈవెంట్ లో మెరిసిన‌ బ్రాహ్మణి.. ప్రణతి

హీరో బాల‌కృష్ణ‌..యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ని ఒకే వేదిక‌పై చూసేందుకు నంద‌మూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. అయితే వారి మధ్య అంతా బాగాలేదని వీరిద్దరి మధ్య చాలా గ్యాప్ ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్లకు చెక్ పెడుతూ బాలకృష్ణ పెద్ద కూతురు.. లోకేష్ భార్య నారా బ్రాహ్మణి.. జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కలిసి కనిపించారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఫార్ములా ఈవెంట్ కి బ్రాహ్మణి ..ప్రణతి కలిసి వచ్చారు. ఈ మధ్య నందమూరి-నారా కుటుంబాల మధ్యన అంతా బాగాలేదని టాక్ ఉండగా బ్రాహ్మణి .. ప్రణతి ఈ కార్యక్రమంలో కలిసి కనిపించడం అందరినీ ఆకర్షించింది.. మళ్లీ ఎన్టీఆర్ లోకేష్ ఫ్యామిలీలు దగ్గరైనట్లు కూడా వినిపిస్తోంది. బ్రాహ్మణి.. ప్రణతి కలిసి కనిపించడంతో ఇక నందమూరి నారా కుటుంబాల మధ్య ఏ వైరం లేదని అర్థమవుతోంది. ఇటీవల జూ.ఎన్టీఆర్ సైతం చంద్రబాబుకు ట్విటర్ లో అభినందనలు తెలిపిందకు ‘థాంక్స్ మావయ్య’ అంటూ కామెంట్ చేయడం కూడా విభేదాలు సమసిపోయినట్టుగా అర్థమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement