చెన్నూర్, ప్రభన్యూస్: ప్రజలకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడంలో బీజేపీ, కాంగ్రెస్ లది ఓకే బాట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నత పాఠశాల మైదానంలో బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో నిర్వహించిన సభకు కేటీఆర్ మఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో ఆరు గ్యారెంటీల అమలుకు నోచుకోలేదనీ ప్రజలు కాంగ్రెస్ పాలనను వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.
దేశంలో బీజేపీ ప్రభుత్వం రాముని పేరు చెప్పుకొని తిరిగి అధికారం చేజిక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, దేశ సంపదను అంబానీ, ఆదానీ లకు పంచుతూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని, వారి మాటలను నమ్మి మళ్ళీ మోసపోవద్దని కోరారు. రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని, నిరంతరం ఉచిత విద్యుత్ అందించి రైతులను అదుకున్న ఘనత కేసీఆర్ దే నని, రెండు రోజుల్లో జరిగే ఎన్నికల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కార్యకర్త ఇంట్లో కేటీఆర్ భోజనం…
చెన్నూర్ ప్రభన్యూస్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చెన్నూరు పర్యటనలో ఉన్నారు. నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ప్రచారసభ అనంతరం ప్రశాంత్ అనే సోషల్ మీడియా వారియర్ ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు.