Tuesday, November 26, 2024

Bonalu – జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనంతో ఉత్సవాలకు శ్రీకారం

ఆషాఢమాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. గోల్కొండ శ్రీ శ్రీ జగదాంబిక మహంకాళీ గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆదివారం లంగర్‌హౌజ్‌ చౌరస్తాలో ప్రారంభమయ్యాయి.

తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పీకర్ గడ్డం ప్రసాద్ , మంత్రులు కొండ సురేఖ , పొన్నం ప్రభాకర్ , మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , డెప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి , ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ , ప్రిన్సిపాల్ సెక్రెటరీ శైలజ , కలెక్టర్ అనుదీప్ లు బోనాలను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేశారు. అక్కడి నుంచి పట్టు వస్త్రాల ఊరేగింపు, తొట్టెల ఊరేగింపు గొల్కొండ కోట వరకు కొనసాగాయి. ఈ కార్యక్రమం మొత్తం దేవాదాయ ఆధ్వర్యంలో నిర్వహించారు..

కాగా, చారిత్రక గోల్కొండ కోటలో కొలువుదీరిన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో.. బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. . 9 వారాల పాటు బోనాల ఉత్సవాలు జరుగుతాయి. గోల్కొండ కోటలోనే బోనాలు ముగింపు ఉత్సవాలు కొనసాగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement