.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు
వేములవాడ, ఆంధ్రప్రభ : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్మ అమ్మవారికి మంగళవారం బోనాల జాతర కొనసాగింది. సోమవారం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం భక్తులు మంగళవారం ఉదయం బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు చెల్లించుకోవడం ఆనవాయితీ.
ఇందులో భాగంగానే భక్తులు నెత్తిన బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుళ్ళు, మేళ తాళాలు, నృత్యాలు చేస్తూ బద్ది పోచమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకొని భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం శోభిల్లింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్చార్జి ఈవో వినోద్ రెడ్డి తెలిపారు.
- Advertisement -