Monday, November 11, 2024

TS : ప్ర‌జా భ‌వ‌న్ కు బాంబు బెదిరింపు… త‌నిఖీలు చేప‌ట్టిన బాంబ్ స్వ్కాడ్

హైద‌రాబాద్ లోని ప్రజా భవన్ కు బాంబ్ బెదిరింపు కాల్ రావడం కలకలం సృష్టిస్తోంది. మరికాసేపట్లో పేలి పోతుంది అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి అగంతకుడు ఫోన్ కాల్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ భ‌వ‌నంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క నివ‌సిస్తున్నారు.

- Advertisement -

పోన్ కాల్ రావ‌డంతోనే పోలీసులు అల‌ర్ట్ అయ్యారు.. స‌మ‌చారాన్ని ప్ర‌జాభ‌వ‌న్ సెక్యూరిటీ విభాగానికి అందించారు.. అక్క‌డ ఉన్న వారిని ఖాళీ చేయించారు.. ప్ర‌జాభ‌వ‌న్ లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement