బోడుప్పల్ నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక సాధారణ సర్వ సభ్య సమావేశం మేయర్ సామల బుచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పారిశుద్ధ్య కార్మికులకు 1000 వేతనం పెంచుతూ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు అమలుపై చర్చించారు. కుక్కల బెడద నుండి రక్షణ కల్పించుటకు వాక్సినేషన్ కొరకు 16,50,000/- కేటాయించారు. స్వచ్చ సర్వేక్షన్ 2023-24 కొరకు 10 లక్షలు కేటాయించారు. పారిశుద్ధ్య విభాగంలో అవసరమైన సామాగ్రి కొరకు 35 లక్షలు కేటాయించారు. ప్రతి డివిజన్ అభివృద్ధి కొరకు 20 లక్షల చొప్పున కేటాయించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద మరమ్మత్తుల గురించి 10 లక్షలు, రా చెరువు వద్ద చట్ పూజ నిర్వహించుటకు 30 లక్షలు, మరో 10 కొత్త క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు 50 లక్షలు నిధులు కేటాయించారు.
TSSPDCL వారికి 50 లక్షలు చెల్లింపులు మరియు HMWSSB వారికి నీటి సరఫరా మరియు లీకేజి నిర్వహణ కొరకు 135 లక్షలు కేటాయించారు. 2 కోట్ల ప్రభుత్వ నిధులతో దోబీ ఘాట్ నిర్మాణం కొరకు కౌన్సిల్ అనుమతి కొరకు ముందు ఉంచారు. రాబోయే బోనాల పండుగకు ఆలయాల అలంకరణకు 8 లక్షలు కేటాయించారు.15వ డివిజన్ లో గౌరవ కార్మికశాఖామంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి ఆదేశానుసారం లక్ష్మారెడ్డి కాలనీ యందు 24.50 లక్షలతో డ్రైనేజి కొరకు నిధులు కేటాయించారు. మరికొన్ని ఇతర అంశాలను కౌన్సిల్ ఆమోదించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్ గారు, కమీషనర్ G. వేణు గోపాల రెడ్డి గారు, కార్పొరేటర్లు, కో అప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.