ఆంధ్రప్రభ, హైదరాబాద్: టీశాట్‌కు కొత్త సీఈఓ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేణుగోపాల్ రెడ్డిని టీ-శాట్ సీఈఓగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న శైలేష్ రెడ్డి స్థానంలో వేణుగోపాల్ రెడ్డికి సీఈఓ పోస్ట్ కట్టబెడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. టీ-శాట్ సీఈవోగా వేణుగోపాల్‌రెడ్డి రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న తెలంగాణ స్కిల్, ఎకడమిక్ అండ్ ట్రైనింగ్ శాటిలైట్ టీవీగా దీనికి విశేష ప్రాధాన్యత ఉంది.
ఈఎం పీఆర్వోగా శ్రీనివాసరావు…
ముఖ్యమంత్రి ప్రజాసంబంధాల అధికారిగా సీనియర్ జర్నలిస్టు వి శ్రీనివాసరావు నియామకమయ్యారు. ఈ మేరకు అధికారక ఉత్తర్వులు మంగళవారం విడుదలయ్యాయి. గడచిన 20ఏళ్లుగా జర్నలిస్టుగా కొనసాగుతున్న ఆయన ఈటీవీ, మహాన్యూస్, బిగ్టీవీతోపాటు పలు సోషల్ మీడియా ఫ్లాట్ ఫారాలలో రిపోర్టర్‌గా పనిచేశారు. ప్రజెంటేర్గా సేవలందించారు. ఆయన స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లికాగా, తాజాగా ఆయనను పీఆర్వోగా ప్రభుత్వం నియామకం చేసింది.
ఏపీఆర్వోగా అన్వేష్‌రెడ్డి…
సీఎం కార్యాలయం అదనపు ప్రజా సంబంధాల అధికారి(ఏపీఆర్వో)గా ఆదిలాబాద్‌కు చెందిన పూండ్లు అన్వేష్‌రెడ్డి నియమితులయ్యారు. ఆయన ఆమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుస్సెట్స్లో ఎంఎస్, హైదరాబాద్‌లోని అనురాగ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన స్వస్థలం ఆదిలాబాద్ మండలం పొచ్చెర్ల గ్రామంకాగా, 30ఏళ్లుగా ఆదిలాబాద్‌లో నివాసం ఉంటున్నారు.