Saturday, November 16, 2024

తెలంగాణ‌లో నీలి విప్లవం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: పెద్దగా జల వనరులే లేని తెలంగాణ ప్రాతంలో చేపలెక్కడ ఉత్పత్తి అవుతాయని.. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చులకనచేసి మాట్లాడిన నాయకులు, నాటి పాలకుల కళ్ళు బైర్లుగమ్మే విధంగా కేసీఆర్‌ సర్కారు మత్స్య రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జలయజ్ఞం ద్వారా అందుబాటులోకి వచ్చిన అనేక భారీ నీటిపారుదల, ఎత్తిపోతల ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయ చెరువులు, కుంటల అభివృద్ధి ద్వారా గ్రామాల్లో పెరిగిన నీటి నిల్వ సామర్థ్యం తదితర వనరులను మత్స్య రంగం అభివృద్ధికి వినియోగించుకునే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోంది. ఈ క్రమంలోనే దేశానికే తలమానికంగా తెలంగాణాలో ఆక్వా యూనివర్సిటీని నెలకొల్పాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. నీలి విప్లవానికి నాంది పలుకుతూ, మత్స్య రంగంలో నవశకానికి పునాదులు వేయబోతున్నారు. ఈ క్రమంలో ప్రతి జిల్లాలోనూ మత్య పరిశ్రమ అభివృద్ధికి ఒక పరిశోధన, అధ్యయన కేంద్రాన్ని (ఆర్‌ అండ్‌ డీ) సెంటర్‌ను నెలకొల్పాలని నిర్ణయంచారు. ప్రతి జిల్లాలో ఆక్వా హబ్‌ ఏర్పాటు చేయడం ద్వారా చేపల ఉత్పత్తి, వ్యాపారాలకు అనువుగా ఉంటుంది. ఇప్పటికే చెరువుల్లో ఉచిత చేపపిల్లల విడుదల కార్యక్రమం ద్వారా ఈ రంగంలపై ఆధారపడిన 58,458 కుటుంబాలకు ప్రభుత్వం నిరవతర ఉపాధి కల్పించింది. కొత్తగా తలపెట్టిన అక్వా హబ్‌ కార్యక్రమంలో భాగంగా పైలట్‌ ప్రాజెక్టుగా సిరిసిల్ల జిల్లాను ఎంపిక చేశారు. పెట్టుబడులకు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ముందుకు పోవాలని నిర్ణయించిన సర్కారు అందుకు తగిన ప్రోత్సాహకాలు కల్పిస్తోంది. ఈ రంగంలో ఇప్పటివరకు రూ.7,218 కోట్ల పెట్టుబులు వచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఫిష్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కోసం 27 కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ ఏడాది ఆఖరులోగా ‘తెలంగాణ ఆక్వా యూనివర్సిటీ’ని నెలకొల్పాలని ప్రభుత్వం యోచిస్తోంది. అనన్ని జిల్లాల్లో ఆక్వా హబ్‌లను నెలకొల్పడం ద్వారా ప్రతి జిల్లాకు 10వేల చొప్పున 3.30 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి అభించనుంది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అధికారులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

పైలట్‌ ప్రాజెక్టు ఫలితం ఇదీ..
పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన తర్వాత సిరిసిల్ల జిల్లా మత్స్య సంపదకు నిలయంగా మారుతున్నది. జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర జలాశయం కేంద్రంగా నీలి విప్లవానికి నాంది పలుకనున్నది. ఇప్పటికే ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు చేతినిండా పనికల్పించిన సర్కారు ఈ దిశగా మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నది. మిడ్‌మానేరులో రూ. 2 వేల కోట్లతో మెగా ఆక్వాహబ్‌ను ఏర్పాటు- చేయాలని సంకల్పించింది. ఐటీ-, పరిశ్రమల శాఖల మంత్రి కేటీ-ఆర్‌ చొరవతో అమెరికాకు చెందిన ఫిషిన్‌ ఇండియా, ఫ్రెష్‌ టూ హోం, ఆనందా గ్రూప్‌, సీపీ ఆక్వా సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. అందులో ఫిషిన్‌ ఇండియా కేజ్‌ కల్చర్‌ ట్రయల్‌ రన్‌ను పూర్తిచేసింది.

ఉపాధి అవకాశాలు మెరుగు
ఈ ఆక్వా హబ్‌తో 10వేల మందికి ఉపాధి లభించనుండగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. జిల్లాలో ఉచిత చేపపిల్లల పెంపకం విజయవంతంగా సాగుతున్నది. వందలాది చెరువులు, కుం టలు, వాగుల్లో విరవిగా మీనాలను పెంచారు. శ్రీ రాజరాజేశ్వర, అన్నపూర్ణ, ఎగువ మానేరు ప్రాజెక్టులతో పాటు- 440 చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రభుత్వం చేపట్టింది. వీటి ద్వారా 106 మత్స్య పారిశ్రామిక సంఘాల్లో 7636 మంది సభ్యులకు ఉపాధి లభించింది. త్వరలోనే మల్కపేట రిజర్వాయర్‌లోనూ చేపల పెంపకం చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.


365 ఎకరాల భూసేకరణ పూర్తి
జిల్లాలోని తంగళ్లపల్లి మండలం చీర్లవంచ సమీపంలో ఆక్వాహబ్‌ ఏర్పాటు- చేయాలని నిర్ణయించింది. ఇందుకు శ్రీరాజరాజేశ్వర జలాశయంలో 365 ఎకరాల భూసేకరణ పూర్తయ్యింది. ఇక్కడే మత్స్య యూనివర్సిటీ- ఏర్పాటు- చేసేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టింది. మంత్రి కేటీ-ఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని జిల్లాలో ఆక్వాహబ్‌లో పెట్టు-బడులు పెట్టేందుకు వివిధ కంపెనీలను ఆహ్వానించారు. ఆయన అమెరికాలో పర్యటించి ప్రభుత్వం పలు కంపెనీలతో ఒప్పందం కుదిర్చారు.

10 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి
మత్స్య సంపదను పెంచి మత్స్య కారులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా మూ డు రిజర్వాయర్లు, 440 చెరువుల్లో 137.92 లక్షల చేప పిల్లలు, 40.32 లక్షల రొయ్య
పిల్లలను మత్స్య శాఖ వదిలిపెట్టింది. ఇందులో మిరిగాల, రవ్వులు, బొమ్మెలు, బంగారు తీగలాంటి విత్తన చేపలను వదిలారు. ఒకప్పుడు రెండు రకాల చేపలు మాత్రమే లభించేవి. ప్రభుత్వం వేసిన విత్తన చేపలతో తీరొక్క చేపలు ప్రజలకు అందుబాటు-లోకి వస్తున్నాయి. ప్రభుత్వం ఉచిత విత్తన చేప పిల్లలతో 10వేల మంది మత్స్య కారుల కుటుంబాలకు ఉపాధి దొరికింది. సిరిసిల్ల జిల్లాలో ఆక్వాహబ్‌ ఏర్పాటు-తో మరో 10వేల మందికి క్రయ, విక్రయాల్లో ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

- Advertisement -

ఏటా కోటి టన్నులే చేపల ఉత్పత్తి లక్ష్యం
ఆక్వాహబ్‌లో పెట్టు-బడులు పెట్టేందుకు మంత్రి కేటీ-ఆర్‌ అమెరికాలోని పలు కంపెనీలతో చర్చలు జరిపారు. ఫిషిన్‌ ఇండియా, ఫ్రెష్‌టూహోం, ఆ నందా గ్రూప్‌, సీపీ ఆక్వా గ్రూప్‌ సంస్థలు ముందుకొచ్చాయి. ఫిషిన్‌ ఇండియా కంపెనీ 125 ఎకరాల స్థలంలో పరిశ్రమ ఏర్పాటు- చేస్తున్నది. ఇం దులో భాగంగా మధ్యమానేరు జలాశయంలో స ర్క్యులర్‌ కేజీస్‌ను ఏర్పాటు- చేసి, కేజ్‌ కల్చర్‌ ట్ర యల్‌ రన్‌ను చేపట్టింది. కొన్ని విత్తన చేపలను కేజ్‌కల్చర్‌లో వేసి ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. రూ. 2వేల కోట్లతో ఏర్పాటు- చేస్తున్న ఆక్వాహబ్‌ ద్వా రా ఏటా కోటి టన్నుల చేపలను ఎగుమతి చేయాలన్నది లక్ష్యంతో ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. సర్కారు మత్స్య కారుల్లో వెలుగులు నింపేందుకు తీసుకుంటు-న్న చర్యలతో ఆయా కుటు-ంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్త మవుతున్నాయి. ఈ తరహాలో వృత్తిపై ఆధారపడిన కుటుంబాలను ప్రోత్సహిస్తూ.. ఆర్థికంగా, సామాజికంగా వారికి భద్రిత కల్పించాలన్న లక్ష్యంతో కేసీఆర్‌ సర్కారు కృషి చేస్తోంది. ఈ రంగంలో పొరుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులను కూడా ఆహ్వానిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement