హైదరాబాద్‌లోని ఓ తెలుగు టీవీ ఛానల్లో ఈ నెల 28న అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా అశ్లీల దృశ్యాలు ప్రసారం కావడం సంచలనంగా మారింది. 15 నిమిషాల పాటు ఈ బ్లూ ఫిల్మ్ ప్రసారం కావడంతో వీక్షకుల అవాక్కయ్యారు.. వెంటనే ఛానల్ నిర్వాహకులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తమది లైవ్ ఛానల్ అని, అర్ధరాత్రి 15 నిమిషాల పాటు అశ్లీల దృశ్యాలు ప్రసారమయ్యాయని పేర్కొన్నారు. ఈ ఘటనతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాటిని తొలగించారని పేర్కొన్నారు. తమ సర్వర్‌ను ఎవరో హ్యాక్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన నిర్వాహకులు, ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement