వరంగల్ జిల్లా కేంద్రంలో ఇవ్వాల ఉదయం ఘోరం జరిగింది. ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరంగల్ చౌరస్తా దగ్గర శివ ప్లాజా బిల్డింగ్ కి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో స్థానికులు Dail 100 ద్వారా సమాచారం ఇవ్వగా బ్లూ కోల్ట్ ఆఫీసర్ శ్రీనివాస్, సాజిద్, రంగయ్య, యాదగిరి తక్షణమే స్పందించారు. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తూ, మంటలను లెక్కచేయకుండా పక్కన ఉన్న నివాస గృహాలని, షాపింగ్ మాల్స్ లో ఉన్న ప్రజలను బయటకి పంపి ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ లు, వెనుకనే నివాసగృహాలు ఉండి, పెద్ద ఎత్తున మంటలు రావడం వల్ల స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కానీ బ్లూకోల్ట్ సిబ్బంది తక్షణ స్పందనతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు కూడా ప్రశంసించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement