Tuesday, November 26, 2024

రక్తదానంతో ప్రాణాలను కాపాడొచ్చు.. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రక్తదానం కొన్ని ప్రాణాలను కాపాడుతోందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. ప్రతీ రక్తపు చుక్క ఒక జీవితాన్ని కాపాడుతుందని గుర్తు చేశారు. దీపావళి, సంక్రాంతి, బతుకమ్మ తదితర పండుగలు ఎలా నిర్వహించుకుంటామో… అదేవిధంగా రెడ్‌ క్రాస్‌ డే, రక్తదాతల దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లొమంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ… ప్రతీ ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానంపై యువతకు మరింత అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తలసేమియా వ్యాధిగ్రస్థుల కోసం పోలీసులు నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.

” రక్తదానంపై చిన్న ప్రేరణ కలిగించినా మరో జీవితాన్ని కాపాడుతుంది. గవర్నర్‌గానే కాకుండా వైద్య వృత్తిలో ఉన్నపుడు ఇది నాకు స్వీయ అనుభవం. రక్తదానం చేయడం వల్ల ఎన్నో కేసుల్లో ప్రాణాలను కాడగలిగాం. మనం డబ్బు, ఆహారం, పుస్తకాలు దానం చేస్తాం. కానీ రక్తదానం చేస్తే ఒక జీవితాన్ని కాపాడుతుంది. ఈ పరిస్థితుల్లో అన్ని దానాలకంటే రక్తదానం గొప్పది.” అని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement