ఇవాళ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ రక్తదానం కార్యక్రమం చేపట్టింది. ఎంజీబీఎస్‌లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రక్తదానం చేశారు. ఆర్టీసీ ఎండీ హోదాలో…మొదటిసారిగా సజ్జనార్ రక్తదానం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ…తలేసిమియా వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ పేషంట్స్, యాక్సిడెంట్ వారికి బ్లడ్ ఎంతో అవసరమని నర్సంపేట డ్రైవర్ శ్రీనివాస్ ఇప్పటి వరకు 80 సార్లు బ్లడ్ డోనేట్ చేశారన్నారు. ఆయన చేత నర్సంపేటలో బ్లడ్ డోనేట్ కాంప్ ప్రారంభమైందన్నారు. టీఎస్ ఆర్టీసీ యాజమాన్య ఇండియన్ రెడ్ క్రాస్ హైదరాబాద్ 97 డిపోలు 67 సొసైటీలో బ్లడ్ డోనెట్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత సంవత్సర కాలంగా బ్లడ్ కొరత ఏర్పడుతుందని వెల్లడించారు. ఆర్టీసి సిబ్బంది, కుటుంబ సభ్యులు బ్లడ్ డొనేట్ చేసి మరొకరికి ప్రాణదాతలు కావాలని పిలుపు నిచ్చారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital