Monday, November 18, 2024

Winning Formula – తెలంగాణ ఎన్నిక‌ల‌లో బిజెపి బిసి మంత్రం …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ మంత్రాన్ని జపించేందుకు భారతీయ జనతా పార్టీ (భాజపా) కార్యాచరణ రూపొందిస్తోంది. వెనుకబడిన తరగతులను (బీసీ) అక్కున చేర్చుకునేందుకు భారతీయ జనతా పార్టీ సరికొత్త వ్యూహాన్ని అమలు చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు- ప్రచారం జరుగుతోంది. వెనుకబడిన తరగతుల్లో బలమైన సామజిక వర్గాలు ముదిరాజ్‌, మున్నూరుకాపు, పద్మశాలి, గౌడ (ఈడి), కురుమ, యాదవ తదితర కులాలకు చెందిన నాయకులను అభ్యర్థులుగా ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు- సమాచారం. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్‌ పార్టీల్లో టికెట్ల కోసం ప్రయత్నించిన ఈ సామాజిక వర్గాల నేతలకు తాము పోటీ- చేసే అవకాశం ఇస్తానన్న భరోసాను కల్పిస్తామన్న సంకేతాలను బలంగా వారికి పంపించాలని నిర్ణయించినట్టు- సమాచారం. బీసీ వర్గాలలో బలమైన సామాజిక వర్గం జనాభాను పరిగణలోకి తీసుకుని ఆయా నియోజకవర్గాలలో సంబందిత కులానికి చెందిన వారికే అసెంబ్లీ టికెట్లను కట్టబెట్టి విపక్ష పార్టీలను ఆత్మరక్షణలో పెట్టాలన్న ప్రతిపాదనపై భాజపా కీలక నేతలు సమాలోచనలు జరుపుతున్నట్టు- అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఒకరోజు పర్యటన నిమిత్తం తెలంగాణకు వచ్చిన కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌ షా మంగళవారం రాత్రి ఢిల్లీ బయలు దేరి వెళ్లేముందు పార్టీ ముఖ్య నేతలతో గంటకు పైగా సమావేశమయ్యారు.

తెలంగాణాలో తాజా రాజకీయ పరిస్థితులు అభ్యర్థుల ఎంపిక ప్రచార వ్యూహం, భారాస కాంగ్రెస్‌ పార్టీ ల వ్యవహారంపై చర్చించారు. టికెట్ల కేటాయింపు వ్యవహారానికి సంబం ధించి భారాస బీసీలకు ఎన్ని టికెట్లను ఇచ్చిందని.. బీసీల్లో ఏఏ సామజిక వర్గాలకు ఎన్నెన్ని అభ్యర్దిత్వాలను ఖరారు చేసిందని అమిత్‌ షా ఆరా తీయగా నాయకులు ఆ వివరాలను అందజేసినట్టు సమాచారం. వెనుకబడిన తరగతుల్లో కీలకమైన సామాజికవర్గం ముదిరాజ్‌లకు ఒక్క సీటు- కూడా ఇవ్వలేదని, ఈ సామాజిక వర్గానికి చెందిన జనాభా తెలంగాణాలో 50 లక్షల పైబడి ఉంటారని, మున్నూరుకాపు, యాదవ, గొల్ల కురుమ, గౌడ, పద్మశాలి సామాజిక వర్గాలకు కూడా అరకొరగా సీట్లు- ఇచ్చారని నివేదించినట్టు- సమాచారం. సమాజంలో 60 శాతం పైగా ఉన్న బీసీలను ప్రధాన పార్టీలు భారాస, కాంగ్రెస్‌లు పూర్తిగా విస్మరించాయని, ఈ వర్గాలను చేరదీస్తే ఈ ఎన్నికల్లో బీసీ జనాభా భాజపాను ఆదరిస్తారని కొందరు నేతలు వివరించగా ఆ దిశగా దృష్టి సారించాలని అమిత్‌ షా ఆదేశించినట్టు- ప్రచారం జరుగుతోంది.

విపక్ష పార్టీల్లో అసంతృప్త నేతలకు వల వేయనున్న భాజపా
కాంగ్రెస్‌, భారాసలలో టికెట్లు- ఆశించి భంగపడ్డ బీసీ వర్గా లను తమవైపు తిప్పుకుని ఎన్నికల్లో పోటీ- చేసే అవకాశం కల్పిం చాలన్న నిర్ణయానికి వచ్చినట్టు- సమాచారం. అసంతృప్తులతో సమాలోచనలు జరిపే భాధ్యతను సీనియర్‌ నేత ఈటల రాజేం దర్‌కు అప్పగించినట్టు- సమాచారం. ఆయా సామాజిక వర్గాల కు చెందిన కుల పెద్దలతో సంప్రదించి అసెంబ్లీ ఎన్ని కల్లో పోటీ-కి భాజపా అవకాశం ఇస్తోందన్న సమాచారాన్ని తెలియజేయాలని భావిస్తు న్నట్టు- సమాచారం. కుల పెద్దలు తమ వర్గాలకు చెందిన అభ్యర్థులకు సంఘీ భావం తెలుపుతూ ఎన్నికల ప్రచారం లో పాల్గొనేలా కూడా చర్యలు చేపట్టా లని నిర్ణయించినట్టు- తెలుస్తోంది. ముదిరాజ్‌ సామాజిక వర్గాన్ని భారాస విస్మరించిన వైనాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసే ఆలోచనపై మంతనాలు జరుపుతున్నట్టు- చెబుతున్నారు.

భారాసకు విశేష సేవలందించిన సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు నియోజకవర్గానికి చెందిన నీలం మధును పార్టీలోకి ఆహ్వానించాలని ప్రతిపాదించారు. ఈ నెల 16న భారాసను వీడుతున్నానని, తనకు ఏ పార్టీ టికెట్‌ ఇస్తానని హామీ ఇస్తే ఆ పార్టీలో చేరి పోటీ- చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. లేని పక్షంలో స్వత్రంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు. షాద్‌నగర్‌కు చెందిన మరో బీసీ నేత అందె బాబయ్యకు కూడా పోటీ- చేసే అవకాశం కల్పించాలన్న యోచనలో ఉన్నట్టు- సమాచారం. ప్రతి జిల్లాలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన కనీసం ముగ్గురు లేదా నలుగురిని ఎంపిక చేసి అసెంబ్లీ బరిలో నిలిపేలా ప్రణాళిక రూపిందించే పనిలో భాజపా అగ్రనేతలు నిమగ్నమైనట్టు- సమాచారం. బీసీల జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించి అక్కడ ఆ సామాజిక వర్గాలకు చెందిన బలమైన వారిని గుర్తించి ఎన్నికల బరిలో దింపాలని అమిత్‌ షా దిశానిర్దేశం చేసినట్టు- పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement