Sunday, November 24, 2024

BJP – మూసీ నది పున‌రుజ్జీవాన్ని వ్య‌తిరేకించం – తేల్చి చెప్పిన కిషన్ రెడ్డి

మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ క‌ట్టాలి
డ్రెయినేజీ వాట‌ర్ క‌ల‌వ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలి
డ్రెయిన్ స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌కుంటే సుంద‌రీక‌ర‌ణ అసాధ్యం
పేద‌ల ఇండ్ల‌ను కూల్చ‌కుండానే ప‌నులు చేయొచ్చు
సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి సూచ‌న‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : మూసీ సుందరీకరణ చేసినా, పునరుజ్జీవం చేసినా అందుకు తాము వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. అయితే ముందుగా మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించాల‌ని, డ్రైనేజీ వాటర్ అందులో కలువకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు.

పేద‌ల ఇళ్ల కూల్చొద్దు!

పేదల ఇళ్లను కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయవచ్చని, ఆ తర్వాతే మూసీ పునరుజ్జీవం చేయాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో మంచినీరు డ్రైనేజీల్లో కలుస్తూ వృథా అవుతున్నాయని, అలాంటి సమస్యల్ని పరిష్కరించాలని తెలిపారు. నగరంలో డ్రైనేజీల సమస్యను పరిష్కరించకుండా మూసీ సుందరీకరణ సాధ్యం కాద‌ని కిషన్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement