Friday, November 22, 2024

నిజాంపేట్ కార్పొరేటర్ ను అనర్హులుగా ప్రకటించాలన్న‌ బీజేపీ

రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు ఓట్ల కలిగి ఉండటం కాకుండా, నిజాంపేట కార్పొరేషన్ లో కార్పొరేటర్లు ఉంటూ, ఆంధ్ర ప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న 8వ వార్డు కార్పొరేటర్ వి.సురేష్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ చట్టం ప్రకారం కార్పొరేటర్ పదవి నుంచి అనర్హులుగా ప్రకటించాలని ( తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 section 11,12,13,195A,2, 6, 7 ) , ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, section 17, 22 or 23) ప్రకారం చర్యలు తీసుకోవాలని అక్టోబర్ 1 తేదీన జిల్లా కలెక్టర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసి నెల రోజులు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎలక్షన్ కమిషనర్ పార్థసారధినీ కలిసి ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ… నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎనిమిదవ‌ వార్డు కార్పొరేటర్ గా ఊటుకూరి సురేష్ రెడ్డి (voter card no:NVT8796708) 2020 జనవరి మున్సిపల్ ఎన్నికల నందు అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఓటు హక్కును కలిగి ఉండి, అదేవిధంగా నిజాంపేట కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా కొనసాగుతూ, ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లా, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం, వీరపునాయునీపల్లి మండలం, బూసిరెడ్డిపల్లి గ్రామం నందు మరొక ఓటు (voter epic no:RCR1309723), పోలింగ్ బూత్ నెంబర్ 149, voter list S.No:494) హక్కును కలిగి ఉండడమే కాకుండా, ఇటీవలికాలంలో ఆంధ్రప్రదేశ్ లోని బసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలు 13-02-2021 జ‌రిగాయన్నారు.

పంచాయతీ ఎన్నికల నందు నిజాంపేట కార్పొరేషన్ 8వ కార్పొరేటర్ ఉట్కూరు సురేష్ రెడ్డి చట్టవిరుద్ధంగా రెండవ ఓటు హక్కు ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల నందు తన స్వగ్రామమైన బుసిరెడ్డిపల్లి నందు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు సమాచారముందన్నారు. తెలంగాణ మున్సిపల్ చట్టం-2019, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 ప్రకారం రెండు ఓటు హక్కులు కలిగి ఉండటమే చట్టవిరుద్ధమ‌ని, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో 8వ వార్డు కార్పొరేటర్ గా కొనసాగుతూ, చట్టవిరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల నందు నిబంధనలకు విరుద్ధంగా ఓటుహక్కును వినియోగించుకున్న నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 8వ‌ వార్డ్ కార్పొరేటర్ సురేష్ రెడ్డి తక్షణమే కార్పొరేటర్ పదవి నుండి అనర్హులుగా ప్రకటించాలన్నారు. పూర్తి సంఘటనపై దర్యాప్తు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీష్, రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ మోర్చా మహిళా ప్రముఖ‌ మల్లేశ్వరి, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి నరేంద్ర, సెక్రటరీ అరుణ్ రావు, నాయకులు సుమన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement