Thursday, November 21, 2024

BJP Voice – తెలంగాణ అభివృద్ధికి నిధులిచ్చిందే కేంద్రం …..బిజెపి ఎమ్మెల్యే

హైదరాబాద్ – గవర్నర్ ప్రసంగంపై దన్యావాద తీర్మానంపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. 412 హామీలు ఇచ్చారని ఇప్పుడు కేవలం 6 గ్యారంటీల గురించే మాట్లాడుతున్నారన్నారు. ఇష్టానుసారం ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారో తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రైతుబంధు రూ.15వేల ఇస్తామన్నారు.. ఎప్పటి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగంలో సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని తెలిపారని.. బీజేపీ సైతం తెలంగాణకు మద్దతు తెలిపిందన్నారు. అయినా బీజేపీ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు.

బీజేపీ లేకుంటే తెలంగాణ వచ్చేదా అన్నారు. ప్రజా వాణి ప్రతిరోజు అన్నారు. ఇప్పుడు వారానికి రెండు రోజులు అంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్దికి నిధులు ఇచ్చిందే మోడీ ప్ర‌భుత్వమ‌న్నారు.. మెడిక‌ల్ క‌ళ‌శాల‌లు ఇచ్చింది కూడా కేంద్ర‌మేన‌ని, అయితే అవి త‌మ ఘ‌న‌తే అని కెటిఆర్ చెప్పుకోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.. కేంద్రం సొమ్ముతో గ‌త ప్ర‌భుత్వం షోకులు చేసుకుంద‌ని ఆయ‌న మండి ప‌డ్డారు. కాగా, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అదృష్టవంతుడని ఒక స్థానంలో ఓడినా సీఎం అయ్యారన్నారు. అనంత‌రం బిజెపి ఎమ్మెల్యే ప్ర‌సంగానికి భ‌ట్టి స‌మాధానం చెబుతూ, తెలంగాణ సంక్షేమం కోసమే హామీలు ఇచ్చామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement