హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు కలిసి రైతులతో రాజకీయం చేస్తున్నాయని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల బాధ్యతను గాలికి వదిలి ఢిల్లీలో, గల్లీ డ్రామాలు ఆడుతున్నాయని ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ఈ ధర్నాల రాజకీయాల వల్ల రైతులను వ్యాపారులు నిలువుదోపిడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. రైతుల ఆగ్రహ జ్వాలల్లో ఈ రెండు పార్టీలు మాడి మసికావడం ఖాయమని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.
‘నగరం నడిబొడ్డున రూ. 2 వేల కోట్ల భూ కుంభకోణం వెనుక ఉన్న మూఠా నాయకుడు ఎవరు..? ‘ అని రేవంత్‌రెడ్డి మరో ట్వీట్ చేశారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్‌కు తెలియకుండానే ఈ దోపిడి సాగుతోందా..? తెలంగాణ సీఎంవో ఆదేశాలు లేకుండా సీఎస్, మున్సిపల్ కమిషనర్ ఇంతలా బరితెగించగలరా..? సర్వే నెంబర్ 327లో లే ఔట్ అనుమతులు రద్దు చేసి ప్రభుత్వ భూమని కాపాడాలి ‘ అని రేవంత్‌రెడ్డి అన్నారు.