గత కొద్ది రోజులుగా బీజేపీ, టీఆర్ఎస్ లు వరిధాన్యం కొనుగోళ్లపై విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే ఈ విషయంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ వేదికగా బీజేపీ, టీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రజల పరువుతీస్తున్నారన్నారు. అన్ని వివరాలు తన దగ్గర ఉన్నాయంటున్న అమిత్‌షా.. కేసీఆర్‌పై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. వరిధాన్యం కొనుగోలు అంశంపై అమిత్ షా డైరెక్షన్‌లోనే కేసీఆర్ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. గత రెండు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాలో రైతులు బలవుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital