Friday, September 20, 2024

TS | ఎన్నికల కోసం 35 కమిటీలు వేయనున్న బీజేపీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే విజయ సంకల్ప యాత్ర ప్రారంభించాలని నిర్ణయించిన ఆ పార్టీ తాజాగా లోక్‌సభ ఎన్నికల కోసం 35పైగా కమిటీలు వేయాలని నిర్ణయించింది. అదేవిధంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఎన్నికల కమిటీ బీజేపీ కార్యాలయంలో సమావేశమయింది. పార్లమెంట్‌ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసింది. ఒక్కో ఎంపీ స్థానం నుంచి ముగ్గురేసి ఆశావహుల పేర్లను పార్టీ జాతీయ నాయకత్వానికి పంపించాలని నిర్ణయించింది.

సికింద్రాబాద్‌ నుంచి కిషన్‌ రెడ్డి, కరీంనగర్‌.. బండి సంజయ్‌, నిజామాబాద్‌.. ధర్మపురి అరవింద్‌, చేవెళ్ల.. కొండా విశ్వేశ్వరెడ్డి, భువనగిరి.. బూర నర్సయ్య గౌడ్‌ పేర్లు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఈటల రాజేందర్‌ ఎక్కడ నుంచి పోటీ-చేయాలనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మల్కాజ్‌గిరి స్థానం నుంచి పోటీకి ఆయన ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అయితే మెదక్‌ లేదా జహీరాబాద్‌ నుంచి పోటీ చేయాలని ఈటలకు బీజేపీ నాయకత్వం సూచిస్తోంది.

- Advertisement -

మల్కాజ్‌గిరి సీటు చాడా సురేష్‌ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్‌, పన్నాల హరీష్‌ రెడ్డి, మల్కా కొమరయ్య, మురళీదరరావు ఆశిస్తున్నారు. మరోవైపు మహబూబ్‌నగర్‌ ఎంపీ టికెట్‌ కోసం డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, శాంతికుమార్‌ పోటీపడుతున్నారు. ఖమ్మం టికెట్‌ రేసులో ఈవీ రమేష్‌, గల్లా సత్యనారాయణ, రంగా కిరణ్‌, వాసుదేవరావులు ఉన్నారు. బలమైన అభ్యర్థులు లేని చోట చేరికలను ప్రోత్సాహించాలని సమావేశం నిర్ణయించింది. అయితే అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఒకసారి ఢిల్లీలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశమైంది.

సిట్టింగ్‌ స్థానలపై అభ్యర్థుల విషయం స్పష్టత ఇచ్చింది. కాగా సోమవారం నాటి తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ భేటీలో కిషన్‌రెడ్డితోపాటు ఎంపీ లక్ష్మణ్‌, డీకే అరుణ, జితేందర్‌ రెడ్డి, మురళీధరరావు, ఈటల రాజేందర్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అరవింద్‌ మీనన్‌ తదితర కీలక నేతలు పాల్గొన్నారు.

తెలంగాణో లోకసభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు దాదాపు 35కి పైగా కమిటీలను నియమించనున్నట్లు సమాచారం. ఒక్కో కమిటీకి ఒక్కో రకమైన బాధ్యతలను రాష్ట్ర నాయకత్వం అప్పగించనున్నట్లు తెలిసింది. గతంలో నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ మీటింగ్‌ సందర్భంగా సక్సెస్‌ చేసేందుకు పలు కమిటీలను ఏర్పాటు చేసినట్లే ఎంపీ ఎన్నికల కోసం ఈ కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఎన్నికల మేనేజ్‌ మెంట్‌ కమిటీ చైర్మన్‌ గా కిషన్‌ రెడ్డి, కన్వీనర్‌ గా లక్ష్మణ్‌ ఉండనున్నట్లు సమాచారం.

కో కన్వీనర్లుగా ఏవీఎన్‌ రెడ్డి, గరికపాటి, రాంచందర్‌ రావు, ఎన్నికల కార్యాలయం ప్రముఖ్‌ గా మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, సహ ప్రముఖ్‌ గా కొల్లి మాధవి, మేనిఫెస్టో కమిటీ ప్రముఖ్‌ గా లక్ష్మణ్‌, చార్జ్‌ షీట్‌ కమిటీ ప్రముఖ్‌ గా మురళీధర్‌ రావు, మీడియా కమిటీ ప్రముఖ్‌ గా కృష్ణ సాగర్‌ రావు, మీడియా రిలేషన్స్‌ కమిటీ ఇన్‌ చార్జీగా ప్రకాష్‌ రెడ్డి, సోషల్‌ మీడియా కమిటీ ఇన్‌ చార్జీగా పోరెడ్డి కిషోర్‌ రెడ్డి, ఎలక్షన్‌ కమిషన్‌, లీగల్‌ ఇష్యూస్‌ కమిటీ-కి ఇన్‌ చార్జీగా ఆంథోని రెడ్డి ఉండనున్నట్లు- తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement