బీజేపీ ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఎనిమిది స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా, విచిత్రంగా ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముగ్గురూ వెనుకంజలో ఉండడం విశేషం. బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్, గజ్వేల్ అభ్యర్థి ఈటెల రాజేందర్ రెండు స్థానాల్లోనూ మూడో స్థానంలో ఉండడం గమనార్హం. ఇక మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లో తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ కంటే 8వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
ఇక దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన రఘునందన్ సైతం ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి కంటే సుమారు 7వేల ఓట్ల వెనుకంజలో కొనసాగుతున్నారు.