ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ :
కలిసికట్టుగా తాము కాంగ్రెస్ పార్టీతో పని చేసి ఉంటే… చర్లపల్లి జైలు మీరు చిప్పకూడు తింటూ ఉండేవాడిని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. మీ స్టేట్మెంట్లు చూస్తుంటే కోల్పోయింది అధికారం మాత్రమే కాదని, మెదడు కూడా కోల్పోయారని స్పష్టమవుతుందని పేర్కొన్నారు. మోదీ గారు మీ కలమం నేతలు, కాంగ్రెస్ నేతలు కలిసిపోయి మరీ కలిసికట్టుగా పని చేస్తున్నారంటూ కేటీఆర్ విమర్శలకు ఎక్స్ వేదికగా రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు.
పదేళ్లు అధికారంలో ఉండి వ్యవస్థలు చిన్నాభిన్నం
పదేళ్లు అధికారంలో ఉండి అన్ని శాఖల్లో వేలు పెట్టి చూసినా… తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను, విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను కేటీఆర్ చిన్నాభిన్నాం చేశారని విమర్శించారు. మీలాంటి వాళ్ళ దగ్గర రాజకీయాలు ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో నేర్చుకునే దౌర్భాగ్యం తమకు పట్టలేదని మండిపడ్డారు. రాజకీయాలు ఎలా చేయాలో, ప్రజల సమస్యలు ఎలా నెరవేర్చాలో తెలిసి ఉంటే అధికారం కోల్పోయి ఉండేవారివి కాదన్నారు.