వడ్లు కొనకుండా బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తోందని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు.. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గ్రామ గ్రామాన బీజేపీ నేతలను నిలదీయాలన్నారు. వడ్లు కొంటరా..కొనరా అని ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు బీజేపీ చేసిందేంటి ? రైతుల కోసం సీఎం చేయాల్సింది చేశారన్నారు. పంట కొనాల్సిన కేంద్రం చేతులెత్తేస్తోందని బీజేపీపై మండిపడ్డారు. పంటలు పండిన చోట ధాన్యాన్ని కొని, పండని చోట, ప్రకృతి విలయాలు ఏర్పడిన చోట ప్రజలకు అవసరమైన ధాన్యాన్ని అందుబాటులో ఉంచడం కేంద్ర ప్రభుత్వ విధి అన్నారు. పంటలు పండించడం రాష్ట్రం బాధ్యత, దాన్ని కొనే బాధ్యత కేంద్రానిదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో కరెంట్ కష్టాలు తొలిగిపోయాయన్నారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చాక ఇప్పటికే 50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో నేరుగా నగదుగా ఇచ్చామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital