Tuesday, November 26, 2024

Big Story | అసెంబ్లీ బరిలో బీజేపీ ఎంపీలు?.. పోటీకి దింపాల‌ని అధిష్టానం నిర్ణయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రానున్న అసెంబ్లి ఎన్నికల్లో తెలంగాణలో విజయబావుటా ఎగురవేసేందుకు బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వ్యూహాత్మకంగా కేంద్ర మంత్రులు, ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ విజయావకాశాలను మరింత మెరుగుపర్చడం కోసం ఈ తరహా ప్రయోగాన్ని బీజేపీ అమలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ముఖ్యనేతలంతా అసెంబ్లి ఎన్నికల బరిలో ఉండాలని బీజేపీ అధిష్టానం రాష్ట్రంలోని ముఖ్యనేతలను ఆదేశించింది.

దీంతో ఇప్పటికే కరీంనగర్‌లో ఎన్నికల ప్రచార రథాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఎంపీ బండి సంజయ్‌ ప్రారంభించారు. అదే సమయంలో మల్కాజిగిరి నుంచి బరిలోకి దిగేందుకు బీజేపీ మధ్యప్రదేశ్‌ వ్య వహారాల ఇన్‌చార్జి మురళీధర్‌రావు, అంబర్‌పేట నుంచి అసెంబ్లి బరిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు నుంచి బీజేపీ ఎంపీ అరవింద్‌ కూడా అసెంబ్లి ఎన్నికల బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

వాస్తవానికి కీలక నేతలు, ఎంపీలను కూడా అసెంబ్లి ఎన్నికల బరిలో నిలపాలన్న ప్రయోగాన్ని గతంలోనే త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అమలు చేసింది. అక్కడ ఓ కేంద్ర మంత్రిని బరిలోకి దింపిఫలితం సాధించింది. తాజాగా ఇదే వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారు. వారిలో జి. కిషన్‌ రెడ్డి కేంద్ర మంత్రిగా, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. కరీంనగర్‌ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ నిన్నమొన్నటి వరకు రాష్ట్రాధ్య్రక్షుడిగా పనిచేశారు.

- Advertisement -

ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. ఈ నలుగురితో పాటు- తెలంగాణ ప్రాంతం నుంచి బీజేపీలో జాతీయస్థాయిలో ఉన్న మురళీధర్‌ రావు, డీకే అరుణ, వెదిరె శ్రీరాం తదితరులను అసెంబ్లీ బరిలో దింపే అవకాశం ఉంది. తద్వారా ఈ నేతలు తమ సీటు-తో పాటు- చుట్టు-పక్కల స్థానాలను కూడా ప్రభావితం చేసి గెలిపిస్తారని పార్టీ భావిస్తోంది.

అధిష్టానం ఆదేశాల నేపథ్యంలో రానున్న అసెంబ్లిd ఎన్నికల్లో వీరంతా అసెంబ్లి ఎన్నికల బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను మరింత మెరుగుపర్చడం కోసం ఈ తరహా ప్రయోగానికి ఆ పార్టీ అధిష్టానం శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ టికెట్‌ కోసం అభ్యర్థుల వడపోత కార్యక్రమం కొనసాగుతోంది. మరోవైపు జాతీయస్థాయి నేతలు, రాష్ట్రంలోని ముఖ్య నేతలు కూడా టికెట్‌ దరఖాస్తు సమర్పించలేదు. అయినప్పటికీ అధిష్టానం నేరుగా వారిని అసెంబ్లిd అభ్యర్థులుగా రంగంలోకి దించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement