ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకే ‘దళిత బంధు’ పేరిట హుజూరాబాద్ లో వందల కోట్ల రూపాయలు కేసీఆర్ ఖర్చు పెడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. తన నియోజకవర్గం సహా రాష్ట్రవ్యాప్తంగా దళితులు, గిరిజనులు, పేదలు ఉన్నారని.. వారి కోసం ఎందుకు నిధులు ఖర్చు పెట్టడం లేదని ప్రశ్నించారు. తన నియోజకవర్గ ప్రజలకు వందల కోట్ల రూపాయల దళిత బంధు నిధులు వస్తాయంటే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల ప్రజాక్షేత్రంలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాజాసింగ్ ప్రకటించారు.
అధికారం కోసం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్ సిగ్గు లేకుండా సంతల్లో పశువుల్లా కొంటున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా.. కేసీఆర్ మాత్రం అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: బండి సంజయ్ పాదయాత్ర పేరు ఖరారు