Thursday, December 12, 2024

TG | హైడ్రా కమిషనర్‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యే.. పలు కంపెనీలపై ఫిర్యాదు

కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఈరోజు హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో హైడ్రామా కమిషనర్ రంగనాథ్‌ను కలిశారు. ఈ సంద‌ర్భంగా చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న పలు కంపెనీలపై ఆయన ఫిర్యాదు చేశారు. ఆయా కంపెనీల పేర్లు ఏమిటో కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.

చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తాను ఫిర్యాదు చేసిన ఐదు కంపెనీలకు అనుమతులు ఇచ్చిన వారిపై… అండగా ఉన్న ప్రభుత్వ పెద్దలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భూ ఆక్రమణలను అరికట్టేందుకు ప్రభుత్వం నూతనంగా చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement