Monday, November 18, 2024

మద్మూర్ లో డబల్ బెడ్ రూమ్ ల కోసం బిజెపి దీక్ష

కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం పరిధిలోని మదునూరు మండలంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే అరుణ తార ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదోడికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తక్షణమే మంజూరు చేయాలని రిలే నిరాహార దీక్ష చేపట్టి వెంటనే ఇళ్ల కేటాయింపు చేయాలని డిమాండ్ చేశారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం 2014 ఎన్నికల హామీ లో అర్హులైన ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఐదు లక్షలతో కట్టిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం 2014 ఎన్నికల తర్వాత ఆ హామీని మరిచిపోయి మళ్లీ 2018 ఎన్నికలలో అదే హామీని పునరావృతం చేసిన విషయాన్ని అరుణతార గుర్తు చేశారు.


జుక్కల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే వెనుకబడిన నియోజకవర్గం గా ఉంది ఇప్పటివరకు రాష్ట్రంలో ఏదైనా నియోజకవర్గంలో సెంటర్ లైటింగ్ లేని నియోజకవర్గం మునిసిపాలిటీ లేని నియోజకవర్గం ఉందంటే అది జుక్కల్ నియోజకవర్గంగా చెప్పుకోవచ్చ‌న్నారు.
అధికార పార్టీ నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హనుమంతు షిండే తనకు తాను మూడు నాలుగు ఇళ్ళను నిర్మించుకుంటున్నార‌ని, .తప్ప పేదలకు ఇల్లు ఉన్నాయా లేదా అనే విషయాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు.
రిలే నిరాహార దీక్షలో కేలూర్ సర్పంచ్ నీలావతి హనుమాన్లు , భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు హనుమాన్లు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణ పటేల్, వీరేశం భారతీయ జనతా పార్టీ జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి వెంకట్ కాలే, తిప్పవారి తుకారం ,విష్ణు, మల్లికార్జున్ దేశాయ్ , తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement