తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీపై రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో ఈ రోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, టీచర్ల సమస్యలు, 317 జీవో పునఃసమీక్షపై గవర్నర్‌తో బండి సంజయ్ బృందం చర్చించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినప్పుడే ఉద్యోగ కేటాయింపు లు చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని, 41 నెలలు ఏమి చేయకుండా ఇప్పుడు అగమాగం కేటాయింపు లు చేస్తున్నారని మండిపడ్డారు.
గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తో భేటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘు నందన్ రావు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు నల్లు ఇంద్రసేనారెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, టీఎస్ పీఎస్సీ మాజీ సభ్యులు సీహెచ్.విఠల్, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, మహిళా మోర్చా రాష్ర్ట అధ్యక్షురాలు గీతా మూర్తి లు ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital