Wednesday, November 27, 2024

బిజెపి నాయకుల అరెస్టు

కరీంనగర్ – పదవతరగతి పేపర్ లీకేజీ అంశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయిని అరెస్టు చేసిన నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారనే సమాచారం మేరకు బిజెపి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బుధవారం తెల్లవారుజామున నుండి పెద్దపల్లి జిల్లాలోని అన్ని మండలాల్లో బిజెపి నాయకులను అదుపులోకి తీసుకొని జిల్లాలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు గొట్టేముక్కుల సురేష్ రెడ్డి మాట్లాడుతూ లీకేజీల ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు బిజెపి చీఫ్ బండి సంజయ్ ని అరెస్టు చేయడం సరైనది కాదన్నారు. అరెస్టులతో తమ పోరాటాలను ఆపలేరన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement