నిజాంబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సుమారు బిజెపి నాయకులు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బోధన్ పట్టణంలో కామన్ సివిల్ కోడ్ కు మద్దతుగా భారీ ర్యాలీ తీసేందుకు బిజెపి నాయకులు సనాహాలు చేశారు. ముందస్తుగానే ర్యాలీ నిర్వహించినట్లు ప్రకటన చేశారు. బోధన్ పట్టణంలో పోలీసుల అనుమతి లేకుండా ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేయకూడదన్న 30 యాక్ట్ అమలు చేశారు. బిజెపి నాయకులు ర్యాలీని అడ్డుకునే ప్రయత్నాలు పోలీసులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. ముందస్తుగానే కొంతమంది బిజెపి నాయకులు అరెస్టు చేయడం మరి కొంతమందిని ఇంటి నుండి బయటకు రాకుండా చేయడం లాంటి చర్యలను తీసుకున్నారు.
బోధన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నా మేడపాటి ప్రకాశ్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి లను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రజల ఉద్యమాలను ప్రజా ఆశయాలను పోలీసులతో ఇంకెన్నాళ్లు అడ్డుకుంటారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి నాయకులు నినాదాలు చేశారు. బోధన్ పట్టణంలో 30 యాక్ట్ అమలు చేశామని పట్టణ సీఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. 30 యాక్ట్ కు వ్యతిరేకంగా ఎవరు కార్యక్రమాలు చేపట్టిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.