Monday, November 18, 2024

బీజేపీ నాయకులు అభివృద్ది నిరోధకులు: మంత్రి కొప్పుల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీజేపీ నాయకులు తెలంగాణ అభివృద్ధి, ప్రజల బాగును ఏ మాత్రం పట్టించుకోకుండా అనవసర రాద్ధాంతం చేస్తోందని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విమర్శించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడితే ప్రశంసించకపోగా విమర్శలకు దిగడరం విచారకరమన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ చూపిన మార్గంలో సీఎం కేసీఆర్‌ అన్న వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. శుక్రవారం 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు పనులను మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు రాజయ్య, మెతుకు ఆనంద్‌, హన్మంతు షిండే, శంకర్‌నాయక్‌, చిన్నం దుర్గయ్య, ఆరూరి రమేష్‌, కోరుకంటి చందర్‌, క్రాంతి కిరణ్‌, రవిశంకర్‌, రేఖానాయక్‌, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ 50 అడుగుల పీఠంతో కలిపి మొత్తం 175 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. నగరం నడిబొడ్డున 12 ఎకరాల స్థలంలో అంబేద్కర్‌ కాంస్య విగ్రహంతో పాటు మ్యూజియం, ధ్యాన మందిరం, గ్రంథాలయం, సమావేశ మందిరాలు, ఫోటో గ్యాలరీ, క్యాంటిన్‌, అతిధుల కోసం గదులు, పార్కింగ్‌, పచ్చదనంతో పరిసరాలను సందరంగా, ఆకర్షనీయంగా, ఆహ్లాదదకరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. దేశ విదేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షిస్తోందని మంత్రి కొప్పుల పేర్కొన్నారు. అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు పనుల వద్దకు బీజేపీ నేతలు రావడంతో పవిత్ర స్థలం మలినమైందని, అంబేద్కర్‌ వాదులు శుద్ది చేయడం జరిగిందన్నారు. రాజ్యాంగంపై సీఎం కేసీఆర్‌తో పాటు తమ పార్టీకి కూడా అన్ని వర్గాల ప్రజల పట్ల గౌరవభిమానాలు ఉన్నాయని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement