బీజేపీ లీడర్ జిట్టా బాలకృష్ణ రెడ్డిని గురువారం అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూన్ 2వ తేదీన నిర్వహించిన ‘అమరుల యాదిలో.. ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’లో సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా ‘స్కిట్’ చేశారని టీఆర్ ఎస్ నేతలు కప్లెయింట్ చేశారు. దీనికి స్పందించిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కాగా, ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే తనను అరెస్టు చేయడం ఏమిటని జిట్టా పోలీసులను ప్రశ్నించారు. ఆయన మాటలను పట్టించుకోని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అతడిని పోలీసులు ఎక్కడికి తీసుకు వెళ్లింది మాత్రం తెలియరాలేదు.
కాగా, జూన్ 7న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై హైదరాబాదులోని ఆబిడ్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్లో సామూహిక అత్యాచారానికి గురైన వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు విడుదల చేశారని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపిసి 228 (A) కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది ఎవరు అనే విషయం తెలియాల్సి ఉంది.