ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు చికిత్స కోసం వస్తున్న కోవిడ్ పేషెంట్లను అడ్డుకోవడంపై ఏపీ బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. చికిత్స కోసం వస్తున్న కోవిడ్ పేషెంట్లను అడ్డగించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. సరిహద్దుల్లో రోగుల ఆర్తనాదాలు వినండి, వారి సమస్య పరిష్కరించి ప్రాణాలు కాపాడండి అని కోరారు. కర్నూలు బార్డర్ లో రోగుల ఆక్రందనలు వినాలని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల అధికారులు ప్రకటనలకే పరిమితం అయ్యారని విమర్శించారు. తెలంగాణ పోలీసులు సాదారణ ప్రయాణికులను 6 గంటల నుండి 9 గంటల వరకు అనుమతించి, అంబులెన్స్ లను మాత్రం వెనక్కి పంపుతున్నారని మండిపడ్డారు. ఇంతకంటే ఘోరం, సిగ్గుచేటు మరొకటి లేదన్నారు.
సాధారణ ప్రజలు తెలంగాణలోని పోలీసు కంట్రోల్ రూమ్ లో అనుమతులును తీసుకోవడం, అది అంబులెన్సు ఉన్న రోగికి వారి బందువులకు సాధ్యమా ? అని ప్రశ్నించారు. ఆంధ్ర పోలీసులు రోగులకు ఇచ్చిన ఈ పాస్ ను సైతం తెలంగాణ పోలీసులు లెక్కచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా రోగులు, ఇతర బాధితులు అత్యవసర సేవల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అంబులెన్స్‌లను తెలంగాణ ప్రాంతంలో ఆడ్డుకోవడం సరికాదన్నారు. ఉమ్మడి రాజధానిలో మరో మూడేళ్ల వరకు మౌళిక సదుపాయాలు వినియోగించుకునే హక్కు ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా ఉందని విష్ణువర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి : కరోనా వైరస్ కూడా జీవే.. అది బతకాలనుకుంటోంది: మాజీ సీఎం