Wednesday, November 20, 2024

హుజురాబాద్‌పై కమల వ్యూహం…

హుజూరాబాద్ ఉపఎన్నికపై బీజేపీ వేగం పెంచింది. హుజూరాబాద్‌లో గెలుపే లక్ష్యంగా కమలం పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుగ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్వంలో హుజూరాబాద్ బీజేపీ ఇంఛార్జ్‌ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తరుగ్ చుగ్ హుజూరాబాద్‌లో బీజేపీ స్థితిగతులను తెలుసుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ ఇన్‌చార్జ్‌ల‌కు దిశా నిర్దేశం చేశారు.


ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్ మాట్లాడుతూ… హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజ‌యం త‌మ‌దేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. టీఆర్ఎస్ కుట్ర‌ల‌న్నింటినీ ఎదుర్కొంటామ‌ని తెలిపారు. ఈటల రాజేందర్‌ గెలుపునకు కృషి చేయాలని హుజూరాబాద్‌ ఇన్‌ఛార్జి, మండల ఇన్‌ఛార్జులకు ఆయ‌న సూచించారు. గెలుపుకోసం టీఆర్ఎస్ పార్టీ నేత‌లు కుట్ర పూరితంగా ప్రయత్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చుపెట్ట‌యినా స‌రే హుజూరాబాద్‌లో గెలవాల‌ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

కాగా, సమావేశంలో కేంద్ర హోం శాఖ స‌హాయ‌ మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘనందనరావు, మాజీ మంత్రి ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధక్షురాలు డీకే అరుణతో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement