వరంగల్ జిల్లా శివనగర్ లోని బతుకమ్మ ఆట స్థలాన్ని కబ్జా కాకుండా చూడాలని గత కొన్ని రోజుల నుంచి బిజేపి ఆధ్వర్యంలో పోరాడుతుంటే ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా హౌస్ అరెస్టులు చేయడం అన్యాయమని బిజేపి నేత గంట రవి కుమార్ అన్నారు. బతుకమ్మ ఆట స్థలాన్ని కాపాడుకుందామని నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వగా ఆదివారం ఉదయమే పోలీసులు గంట రవి కుమార్ ఇంటికి చేరుకుని ఆయన్ను గృహ నిర్భంధం చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ శివనగర్ బతుకమ్మ ఆట స్థలాన్ని అభివృద్ధి చేస్తే ఎవరూ అడ్డుకోరని.. ఆక్రమణలకు మాత్రమే వ్యతిరేకిస్తామన్నారు. ఇక్కడ నిజంగా ఆభివృద్ధి చేస్తే ఆ వివరాలు ప్రజలకు చెప్పాలన్నారు. చెరువు విస్తీర్ణంలో ఎంత స్థలంలో ప్రగతి చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ జరిగే పనుల గురించి ప్రజలకు అర్థమయ్యేలా 3డి మ్యాప్ రూపంలోగానీ, సూచిక బోర్డులను కానీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రగతి పనులను సూచిస్తూ డిపిఆర్ (డీటైల్డ్ ప్రజెక్ట్ రిపోర్ట్)ను ప్రజల ముందు ఉంచాలన్నారు. అభివృద్ధి పనులను నిరోధించే, వ్యతిరేకించే వారు ఎవరూ లేరన్నారు. ఆట స్థలాన్ని కాపాడేందుకు మేధావులు, ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
బతుకమ్మ ఆట స్థలంపై పోరాటం.. బీజేపీ నేత గృహ నిర్భంధం
Advertisement
తాజా వార్తలు
Advertisement