Sunday, November 24, 2024

కేసీఆర్ కుట్రలు.. హరీష్ రావు అమలు: ఈటల

హుజురాబాద్ ఉపఎన్నికలో తనను ఓడించేందుకు సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామ దళితులు ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. కేసీఆర్ కుట్రలను మంత్రి హరీష్ రావు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని కులాల బంధువులకు GO రూపంలో కెసిఆర్ ఒక కత్తి ఇస్తున్నారని అన్నారు. ఆ కత్తితో పేదల గొంతుక అయిన తనను పొడిచి చంపమని కుట్రలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని, తనను ఓడించేందుకు నాయకులను రూ.200 కోట్లు ఖర్చు పెట్టి కోనుగోళ్లు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రులు ఎమ్మెల్యేలు దావత్ లు ఇచ్చి స్వయంగా వారే వడ్డిస్తున్నారని, మందు పోస్తున్నారని చెప్పారు. 2 గుంటలు ఉన్నవానికి 200 ఎకరాలు ఉన్న వానికి జరుగుతున్న ఎన్నిక అంటూ టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2 గుంటలు ఉన్న అతను ఎలా 200 కోట్లు పెట్టి నాయకులను కొన్నారని ప్రశ్నించారు.

దళితుల మీద ప్రేమతో దళిత బంధు రాలేదని, కేవలం దళితుల ఓట్ల మీద ప్రేమ మాత్రమే ఉందని అన్నారు. కేసీఆర్ కు నిజంగా ప్రేమ ఉంటే మొత్తం దళిత బంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని బకాయిలు పెండింగ్ లోనే ఉన్నాయని ఈటల అన్నారు. రూ. 4 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బాకి ఉందన్న ఆయన.. మంత్రి హరీష్ దానిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని నిలదీశారు. 57 సంవత్సరాల లోపు పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పెంచన్లకే డబ్బులు లేవని, ఆర్థిక వ్యవస్థ కుదేలైందని అన్నారు. ప్రభుత్వ భూములు అమ్మితే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల పాలుచేశారని పేర్కొన్నారు.  

ఇది కూడా చదవండి: పేపర్ బాయ్ మాటలకు కేటీఆర్ ఫిదా!

Advertisement

తాజా వార్తలు

Advertisement