రిజర్వేషన్ల రద్దుపై ప్రమాణానికి సిద్దమా?
…మీకు దమ్ముంటే… ప్రమాణం చేద్దాం రండి*
…డేట్, టైం, వేదిక మీరే డిసైడ్ చేయండి
…నేను అవినీతిపరుడినైతే…అధికారంలో ఉంటూ ఏం పీకారు
…మీ ఆస్తులపై, నా ఆస్తిపాస్తులపై విచారణకు సిద్దమా
.. కేటీఆర్ అక్రమాస్తుల చిట్టా విప్పుతా
…కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ సవాల్
ఆంధ్రప్రభ కరీంనగర్ – హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసే ఉద్దేశం బీజేపీకి లేదని కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియతో మాట్లాడుతూ… త్వరలోనే కేటీఆర్ అక్రమాస్తుల చిట్టా బయటపెడతానని.. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అక్రమ ఆస్తులపై కచ్చితంగా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై సైతం బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయం నేడు మీడియాతో మాట్లాడుతూ , కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. ఓడిపోతారనే భయంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కై ఒకే స్వరాన్ని విన్పిస్తూ ప్రజల్లో భయందోళనలను స్రష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయా నేతలకు సవాల్ విసిరారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం యధాతథంగా కొనసాగిస్తుందన్నారు. ఈ మాటకు మేం కట్టుబడి ఉన్నామని, ఇదే విషయంపై బీజేపీ పక్షాన నేను ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని కూడా ఒప్పించి తీసుకొస్తా డేట్, టైం, వేదిక మీరే ఫిక్స్ చేయండన్నారు. అదే సమయంలో రాజ్యాంగ స్పూర్తికి భిన్నమైన, సుప్రీం తీర్పుకు వ్యతిరేకమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రమాణం చేసే దమ్ము మీకుందా అని సీఎం కు సవాల్ విసిరారు.
రిజర్వేషన్ల రద్దు పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కుమ్కక్కై ప్రజల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. బండి సంజయ్ అవినీతిపరుడంటూ కేటీఆర్, పొన్నం ప్రభాకర్ లు ఆరోపణ చేయడం సిగ్గుచేటన్నారు. నేను అవినీతికి పాల్పడితే ఇన్నాళ్లు అధికారంలో ఉన్నది మీరే కధా నాపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ భూస్తాపితం కావడానికి ప్రధాన కారణం కేటీఆర్ అని, జనం ఛీ కొట్టినా ఆయనకు అహంకారం తగ్గలేదన్నారు. కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడని, అమెరికాలో చిప్పలు కడిగిన బతుకు నీదని, మీ అయ్య లేకపోతె నిన్ను కుక్కలు కూడా దేకేవి కాదన్నారు. అమెరికాలో రబ్బరు చెప్పులు, ముడతల చొక్కతో తిరిగే నువ్వు మీ అయ్య టీఆర్ఎస్ పెడితే వచ్చి సిరిసిల్ల టిక్కెట్ పై పోటీ చేసి కేకే మహేందర్ రెడ్డి పొట్ట కొట్టిన నీచుడివన్నారు.
నేను మా అయ్య పేరు చెప్పుకుని రాలేదని 1994లోనే అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గా గెలిచానని, ఆ తరువాత కూడా మళ్లీ డైెరెక్టర్ గా గెలిచిన. 2005 నుండి రెండు సార్లు కార్పొరేటర్ గా పోటీ చేసిన గెలిచిన. 2014, 18లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన. 2019లో ఎంపీగా పోటీ చేసి 89 వేలకుపైగా మెజారిటీతో గెలిచనన్నారు.అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోయి అల్లాడుతుంటే అధికారంలో ఉండి కేసీఆర్ నయాపైసా ఇయ్యకపోతే వాళ్ల దగ్గరకు పోయి అండగ నిలిచనన్నారు. రుణమాఫీ ఇయ్యకుంటే, వడ్లు కొనకపోతే రైతుల పక్షాన పోరాడానని, నిరుద్యోగులకు ఉద్యోగాలియ్యకుండా రోడ్డునపడేస్తే వాళ్ల పక్షాన కొట్లాడి జైలుకు పోయానన్నారు. 317 జీవో సవరించాలని ఉద్యోగులు రోడ్డున పడితే వాళ్ల పక్షా ధర్నాలు చేసి జైలుకు పోయానని, మరోసారి కరీంనగర్ ప్రజలు తనకు పట్టంకట్టెందుకు సిద్ధమయ్యారన్నారు.