కాంగ్రెస్కు కు ఓటు ఇవ్వండి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం
నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం
బిజెపి ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేస్తారు
50శాతం రిజర్వేషన్లను మరింత పెంచుతాం
అట్టడుగు వర్గాల ప్రజలకు అండగా ఉంటాం
నిర్మల్ జన జాతర బహిరంగ సభలో రాహుల్ గాంధీ
తెలంగాణకు బిజెపి ఇచ్చింది.. గాడిద గుడ్డే
లక్ష మెజార్టీతో అదిలాబాద్ సీటు కైవసం చేసుకుంటాం
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నిర్మల్ ప్రతినిధి, మే 5 (ప్రభ న్యూస్): త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసి గెలిపిస్తే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామనీ కాంగ్రెస్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని క్రషర్ గ్రౌండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జన జాతర బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు హాజరయ్యారు.
కెసిఆర్ మహిళలాగా చీర ధరించి బస్సులో తీర్థయాత్రలు ఉచితంగా చేయ్యాంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను చూడలేక అక్కాసుతో మహిళకు ఉచితంగా బస్సులో ప్రయాణం కల్పిస్తే. దాన్ని తప్పు పట్టడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మల్ జన జాతర బహిరంగ సభలో తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలో భాగంగా ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామని మొదటిది మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం. ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి 10 లక్షలకు పెంచడం. రూ 500 కే సిలిండర్ పంపిణీ. పేదలకు గృహలక్ష్మి పథకం కింద సొంత స్థలం ఉంటే ఐదు లక్షలు కేటాయించడం జరిగిందన్నారు.
ఈనెల తొమ్మిది లోపు రైతులకు రైతు భరోసా కింద మిగిలినవారికి డబ్బులు ఖాతాలో వేస్తామన్నారు. ఆగస్టు 15 నాడు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్నారు. తెలంగాణకు మోడీ ఇచ్చింది గాడిద గుడ్డేనని తెలంగాణ పౌరుషానికి మోడీతో జరుగుతున్న ఎన్నికలుగా గుర్తించి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆదివాసి మహిళా బిడ్డ ఆత్రం సుగుణను లక్ష మెజార్టీతో గెలిపించాలని పేరుపేరునా ఓటర్లను కోరారు. స్వతంత్రం వచ్చి 70 ఏళ్ల చరిత్రలో అదిలాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీ కూడా మహిళకు టికెట్ ఇవ్వలేదని ఒ పేదింటి ఆదివాసి మహిళను కాంగ్రెస్ భారీ దింపిందని గుర్తు చేశారు..వెనుకబడిన అదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత నాదేనని బహిరంగ సభలో హామీ ఇచ్చారు.
అంతకుముందు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ …
పదేండ్ల లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అన్ని రంగాలను బ్రష్టు పట్టించి ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం కడుపుకుందని ఆరోపించారు. మరోసారీ బిజెపి అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ సాంగ్ సూచనల మేరకు రాజ్యాంగాన్ని మార్చేసి రిజర్వేషన్లు రద్దు చేసేందుకు కుట్రలు పన్నుతుందని ఆరోపించారు . దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తుందని అందుకు అనుగుణంగా ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని పరిరక్షించి 50 శాతం ఉన్న రిజర్వేషన్లను మరింత పెంచి అన్ని వర్గాల పేదలకు పంచుతాం. దేశంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం. అందుకు అనుగుణంగా పీజీ డిప్లొమా చేసిన వారిని గుర్తించి వారికి ఏడాది పాటు ఉచిత శిక్షణను ఇచ్చి ప్రైవేట్ కంపెనీలో గాని ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించే విధంగా చర్యలు చేపడతామన్నారు.
16 లక్షల కోట్ల రూపాయలను బడా కంపెనీలకు మాఫీ చేసిందని అదే డబ్బులను 25 కోట్ల మంది ప్రజలకు పంపిణీ చేయవచ్చని గుర్తు చేశారు . పేదవారిని గుర్తించకుండా కేంద్ర బిజెపి ప్రభుత్వం వృధా చేసిందని దుయ్యబట్టారు. బిజెపి ప్రభుత్వానికి దళిత ఆదివాసుల బీసీల మైనార్టీల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఆదాని అంబానీలకు లాభం చేకూర్చేలా అన్ని రంగాలను ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతుందని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రవేశపెడుతున్న ఆరు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేఅమలు చేస్తామన్నారు. దేశంలో మిగిలిపోయిన 30 లక్షల ఉద్యోగాలను యువతకు భర్తీ చేస్తామన్నారు. బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఐఏఎస్ ఐపీఎస్ లలో అగ్రవర్ణాలకే పెద్ద పీట వేస్తున్నారని తము అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు. ఆదివాసులకు మైనార్టీలకు బీసీలకు ఐఏఎస్ ఐపీఎస్ లలో చర్చి ఎందుకు వారికి పెద్ద పీట వేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల హక్కులను కాలరాశి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు బిజెపి ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు చేస్తుందని ఆయన నిప్పులు చేగరారు. దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన రెండు విడతల పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమికి మెజార్టీ సీట్లు రానున్నాయని ఆయన జోష్యం చెప్పారు.