Wednesday, November 20, 2024

BJP Praja Garjana – నేడు ప్ర‌ధాని మోడీ రాక – పాల‌మూరులో బ‌హిరంగ స‌భ …

హైద‌రాబాద్ – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణలోని పాలమూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రధాని మోడీ. వెంటనే ఒంటి గంట 35 నిమిషాలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌ నగర్‌ వెళ్తారు… కాగా, మోడీకి స్వాగ‌తం చెప్పేందుకు ఈసారి కూడా కెసిఆర్ ఎయిర్ పోర్టుకు వెళ్ల‌డం లేదు.. వైర‌ల్ ఫీవ‌ర్ తో బాధ‌ప‌డుతుండ‌టంతో కెసిఆర్ స్థానంలో మంత్రి శ్రీనివాస్ యాద‌వ్ స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు..

రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..

పాలమూరు పర్యటనలో జాతీయ రహదారులు, రైలు మార్గాలు, పెట్రోలియం – సహజ వాయువు, ఉన్నత విద్యలకు సంబంధించి దాదాపుగా రూ.13వేల 500 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని. నాగ్ పుర్- విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా రోడ్డు ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన చేస్తారు. అలాగే 90 కి.మీ. పొడవైన ఫోర్ లైన్ యాక్సెస్ తో కూడిన ఖమ్మం టు విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు ప్రధాని శ్రీకారం చుడతారు. రూ. 500 కోట్ల వ్యయంతో నిర్మించిన 37 కి.మీటర్ల జక్లేరు-కృష్ణా న్యూ రైల్వే లైన్‌ను కూడా దేశప్రజలకు జాతీయం చేస్తారు ప్రధాని. ఈ రైలు మార్గం నారాయణపేట జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలను రైలు మార్గాల ద్వారా చిత్రపటంలోకి తీసుకురానున్నారు. అలాగే హైదరాబాద్ టు రాయ్‌చూర్, రాయ్‌చూర్‌ టు హైదరాబాద్ కి తొలి రైల్వే సర్వీసును ప్రధాని ప్రారంభిస్తారు. చమురు, గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టులను శంకుస్థాపనతో పాటు వాటిని జాతికి అంకితమివ్వనున్నారు ప్రధాని మోదీ. హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన అయిదు క్రొత్త భవనాలను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.

పాలమూరు ప్రజాగర్జన సభకు బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. భారీగా జనసమీకరణ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్య్రమాలను సభలో వివరించనున్నారు ప్రధాని మోడీ. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోడీ స్పీచ్‌పై ఉత్కంఠ నెలకొంది.

మోదీ పర్యటన ఇలా..
మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి మోదీ
అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు
2.10 గంటలకు మహబూబ్‌నగర్ హెలిప్యాడ్ వద్దకు ప్రధాని
2.15 నుంచి 2.50 వరకు మహబూబ్‌నగర్‌లో వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు
3 గంటలకు బహిరంగసభ వేదిక వద్దకు
4 గంటల వరకు బహిరంగ సభ వద్దే ప్రధాని
4.10 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి హెలికాప్టర్‌లో శంషాబాద్‌కు పయనం
4.45 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న మోదీ
.50 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి

Advertisement

తాజా వార్తలు

Advertisement