Saturday, November 23, 2024

వైన్ షాప్ ను అడ్డుకున్న కాలనీ వాసులు… మద్ద‌తుగా బీజేపీ ధ‌ర్నా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం డివిజన్ లోని కైలాష్ హిల్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేయబోతున్న వైన్ షాప్ నిర్మాణాన్ని కాలనీ వాసులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత ఆధ్వర్యంలో అడ్డుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు హరీష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ… కైలాష్ హిల్స్ కాలనీలోకి వెళ్ళడానికి రెండు ప్రధాన దారులు ఉండగా మహాదేవపురం నుంచి వచ్చే దారిలో ఇప్పటికే ఒక వైన్ షాప్ ఉండడం, దానివల్ల కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారన్నారు. కాగా ఇప్పుడు మరో రహదారిలో కాలనీ వాసులను తీవ్ర ఇబ్బంది పెట్టే విధంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కొందరు కాలనీ వాసులు చెప్పినా వినకుండా అక్కడ వైన్స్ షాప్ పెట్టడానికి రాత్రికి రాత్రి నిర్మాణాలు చేపట్టారన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో వైన్స్ నిర్మాణం చేయకూడదని ధర్నా చేయడం జరిగిందన్నారు. కాలనీ వాసులకు పూర్తి మద్దతుగా భారతీయ జనతా పార్టీ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్, జిల్లా శాఖ డివిజన్ అధ్యక్షులు ఎల్లవేళలా మీకు తోడుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు ముఖ్య పాత్ర పోషించారని అభినందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు బుచ్చి రెడ్డి, ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, డివిజన్ ఉపాధ్యక్షులు రాజారెడ్డి, కార్యదర్శి రాజేష్, రవి, సాయి ప్రసాద్, అధ్యక్షులు పున్నారెడ్డి, శ్రీరాములు, దుర్యోధన, కాలనీ ప్రధాన కార్యదర్శి సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామకృష్ణ రెడ్డి, గిరి కిరణ్, లక్ష్మీ, అరుణ, లీలావతి, గంగ భవాని, కాలనీవాసులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమంలో హాజరయ్యారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement