Friday, November 22, 2024

మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట బిజెపి ధర్నా… ప‌లువురు నేత‌లు అరెస్ట్

ప్రభ న్యూస్ ప్రతినిధి మేడ్చల్ ఆగస్ట్ 25: అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కు యత్నించిన బిజెపి నాయకులు, కార్యకర్తలకు పోలీసులు అడ్డుకున్నారు. ఆ త‌ర్వాత వారిని అరెస్ట్ చేసి, శామీర్ పేట, అల్వాల్ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. పోలీస్ లు అరెస్ట్ అయిన‌ వారిలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, బిజెపి మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుద్ధి శ్రీనివాస్, జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు రంగుల శంకర్, కిషాన్ మోర్చ జిల్లా రూరల్ ప్రధాన కార్యదర్శి కృష్ణ, ఘట్కేసర్ ఎం.పి.పి సుదర్శన్ రెడ్డి తదితరులు న్నారు.

ఈ సందర్భంగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం విపక్ష నాయకుల పట్ల అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్, నిరుద్యోగ భృతి అమలు చేయాలని కలెక్టరేట్ ముందు ప్రజాస్వామిక పద్దతుల్లో ధర్నా చేయటానికి ప్రయత్నిస్తే అక్రమంగా అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్లో నిర్బంధించటం ఎంతవరకు సమంజసమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement