కాగజ్ నగర్ – గత ఎన్నికల సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ పోడు రైతులందరికీ పట్టాలు ఇస్తామన్న కేసీఆర్, కేవలం ఎస్టీల్లో కొద్ది మందికి మాత్రమే పట్టాలిచ్చి చేతులు దులుపుకుంటున్నారని దుయ్యబట్టారు భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డా.పాల్వాయి హరీష్ బాబు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ. పట్టాల పంపిణీ అని చెప్పి కంటితుడుపు చర్యగా పోడు రైతులను మభ్యపెడితే ఊరుకునేది లేదు తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం పోడు రైతులందరికీ పట్టాలు ఇచ్చేవరకు భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలియజేశారు.
కాగా,సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం 250 మంది పర్మినెంట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం లేదని అన్నారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించి వారికి ఇస్తామన్న రూ.30 వేల పరిహారం కూడా ఇప్పించాలని డిమాండ్ చేశారు. స్థానికేతరులు కాకుండా స్థానికులతోటే ఉద్యోగాల భర్తీ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, నాయకులు గొలెం వెంకటేష్,సిందం శ్రీనివాస్,మాచర్ల శ్రీనివాస్, ఈర్ల విశ్వేశ్వర్ రావు, రాజేందర్ జంజోడ్, వలపదాసు రమేష్, ముత్తు అశోక్, చేరాల శ్రీనివాస్, కాయతోజు శ్రీనివాస్, గుమ్ముల సాయి, సందెల సంతోష్, రావుల నరేష్, కొండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.