న్యూ ఢిల్లీ – వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లోనూ బీజేపి బలమైన అభ్యర్ధులను పోటీకి నిలుపుతుందని బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో తెలంగాణ బిజెపి నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అలాగే 19 నియోజకవర్గాల్లో బహిరంగసభలు పెట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం బూత్ స్థాయి వరకు పనిచేస్తున్నామని అన్నారు. ప్రజాగోస, బీజేపీ భరోసా, స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ తో ప్రజల ముందుకు వెళ్తున్నామని అన్నారు.. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో అధికారంలోకి రావడం తధ్యమంటూ థీమా వ్యక్తం చేశారు.. కాగా,లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాను అరెస్టు చేస్తే బీజేపీకి ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేస్తే స్పందించిన కేసీఆర్ ఆయన కుమార్తె కవితకు సీబీఐ నోటీసులిస్తే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. లిక్కర్ కేసులో కవితకు సంబంధాలు ఉన్నాయని సీబీఐ ఛార్జీషీటులో పేర్కొందని ఆయన గుర్తు చేశారు. అవినీతి పనులు చేస్తే చట్టానికి ఎవరూ అతీతం కాదన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement