: తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ప్రధాని మోడీ అన్నారు. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సచివాలయానికి వెళ్లని సీఎం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ఫామ్‌హౌజ్‌లో పడుకునే ముఖ్యమంత్రి మనకు అవసరమా? అని సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. ఈటలకు బయపడే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని చెప్పారు. తూప్రాన్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు
26/11 దాడుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. చేతకాని అసమర్థ నాయకులు దేశాన్ని పాలిస్తే ఇలానే ఉంటుందని అన్నారు. కాంగ్రెస్, కేసీఆర్ ఒక్కటే ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ప్రజలను కలవని సీఎం మనకు అవసమా? అంటూ తెలుగులో మాట్లాడిన మోడీ.. దుబ్బాక, హుజూరాబాద్‌లో ట్రైలర్ చూశారు.. ఇకపై సినిమా చూస్తారని అన్నారు.
బీజేపీతోనే సకల జనుల సౌభాగ్య తెలంగాణ సాధ్యమవుతుందని ప్రధాని అన్నారు. బీజేపీ తెలంగాణ ప్రతిష్టను పెంచుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ నిర్ణయించింది. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. బీసీలకు బీజేపీతోనే ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పారు