Saturday, June 29, 2024

BJP – ప్ర‌జా సేవ అంటే శ‌వానికి సేవే! బీజేపీ నేత‌ బూర‌ న‌ర్స‌య్య

భువ‌న‌గిరిలో ఎయిమ్స్ లాంటి సంస్థ‌ల ఏర్పాటు, రూ.900 కోట్ల‌తో అభివృద్ధి ప‌నులు చేసినా, రూ.500 ల‌కు ఓటు అమ్ముకుని త‌న‌ను ఓడించార‌ని మాజీ ఎంపీ, భువ‌న‌గిరి లోక్‌స‌భ‌ బీజేపీ అభ్య‌ర్థి బూర న‌ర్స‌య్య గౌడ్ అన్నారు. స్టార్ బ్యాడ్మింటెన్ క్రీడాకారుడు సైనా నెహ్వాల్ టీట్‌కు స్పందిస్తూ ఎక్స్ వేదిక‌గా ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హిందు ఓటర్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని పేర్కొనారు. ఈ ఓటమి రామమందిరం కోసం ప్రాణాలు అర్పించిన వారిని అవమానించడేమేనని అన్నారు.

ప్ర‌జా సేవ‌డం అంటే..

ప్రజలకు సేవ చేయడం అంటే శవానికి సేవ చేయడం లాంటింది అని తెలుగులో ఓ సామెత ఉందని గుర్తు చేశారు. కాగా అయోధ్యలో ఓ యువకుడు భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలకు సంబందించిన వీడియోను హైదరాబాద్ బీజేపీ అభ్యర్ధి మాదవీలత పోస్ట్ చేస్తూ.. ఈ సోదరుడి కన్నీళ్లు వృథాగా పోవు అని ఎక్స్ వేదిక‌గా ట్వీట్ చేశారు. దీనిపై బ్యాడ్మింటెన్ క్రీడాకారుడు సైనా నెహ్వాల్ చాలా దు:ఖంతో మాట్లాటార‌ని, అందుకు బూర నర్సయ్య పై విధంగా ట్వీట్ చేశారు. మీ ఓటమి ఆశ్యర్యాన్ని కల్గిస్తుందని, మీరు సహనాన్ని కోల్పోవద్దు. మళ్లీ ప్రయత్నించి మంచి ఫలితాలు సాధించాలి అంటూ నెటిజ‌న్లు కామెంట్ పెడుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement