Tuesday, September 17, 2024

BJP – అక్బ‌రుద్దీన్ చిత్తుగా ఓడిస్తాం … బండి సంజయ్

  • కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌
  • కొడంగ‌ల్లో పోటీ చేయించాల‌ని సీఎంకి స‌వాల్‌
  • భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యంలో ప్ర‌త్యేక‌పూజ‌లు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, హైద‌రాబాద్: పాత‌బ‌స్తీలో బోనాలు పండ‌గ సంద‌ర్భంగా బాగ్య‌ల‌క్ష్మీ అమ్మ‌వారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ద‌ర్శించుకుని ప్ర‌త్యేక‌పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. కొడంగల్‌లో అక్బరుద్దీన్ పోటీ చేస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామని అన్నారు. సీఎం రేవంత్‌కు దమ్ముంటే అక్బర్‌ను కాంగ్రెస్ టికెట్‌పై కొడంగల్‌లో పోటీచేయించాలని సవాల్ చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ కౌంటరిచ్చారు. అక్బర్ కాంగ్రెస్‌లో చేరితే కొడంగల్ నుంచి గెలిపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, ఆయనకు స‌మాధానంగా పైవిధంగా వ్యాఖ్య‌లు చేశారు. ప్రతి ఇంటికి ఒక కార్యకర్తను ఇంచార్జ్‌గా నియమిస్తామని, కొడంగల్‌లో అక్బరుద్దీన్‌కు డిపాజిట్ రాకుండా చూసే బాధ్యత తమదని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement