Friday, November 22, 2024

BJP – ఇక ఇండియా కూట‌మి కుక్క‌లు చింపిన విస్త‌రే – బండి సంజ‌య్ ..

క‌రీంన‌గ‌ర్ – ఇండియా కూట‌మి ఇక కుక్క‌లు చింపిన విస్త‌రేన‌ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.. అతుకుల బొంత‌గా ఏర్ప‌డిన ఈ కూట‌మి మ‌నుగ‌డ అసాధ్య‌మ‌ని అన్నారు..కరీంనగర్ లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో ఎంపీ లాడ్స్ నిధులు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించిన సోలార్ పవర్ ప్లాంట్ ను నేడు ఆయ‌న పరిశీలించారు. చ‌ర్ల‌ప‌ల్లి గ్రామంలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ,జెడియు బిజెపిలోకి వ‌చ్చేసింద‌ని , ఆప్ , తృణ‌మూల్ ఒంట‌రిగానే పోటీ చేస్తున్నాయ‌ని, ఇక డిఎంకె సైతం ప‌క్క చూప‌లు చూస్తున్న‌ద‌ని, స‌మాజ్ వాది పార్టీ సైతం కాంగ్రెస్ కు హ్యాండిచ్చిద‌ని అన్నారు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో దేశ వ్యాప్తంగా 350 లోక్ స‌భ స్థానాలు,తెలంగాణాలో 10 స్థానాలు గెలుచుకోవ‌డం ఖాయ‌మ‌న్నారు..


ఇక పదవీకాలం ముగుస్తున్న సర్పంచులకి కొట్ల రూపాయల అప్పులు ఉన్నవని, కేంద్రం నేరుగా సర్పంచులకి డబ్బులు ఇస్తే గత ముఖ్యమంత్రి నిధులని దారి మళ్లీంచారని ఆరోపించారు. కేటీఆర్, కేసీఆర్, గత ప్రభుత్వం సర్పంచ్ లకి ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ ల గురించి మాట్లాడే అర్హత లేదని కీలక వ్యాఖ్యలు చేశారు.నిధులు మళ్ళీంచిన గత ముఖ్యమంత్రి కెసిఅర్ పై కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాన్ని నమ్మి సర్పంచ్ లు పనులు చేస్తే.. బిల్లుల రికార్డులు చేయలేదని, బిల్లులు రాక సర్పంచులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. సర్పంచ్ ల మెడమీద కత్తి పెట్టి అధికారులు పనులు చేపించారన్నారు. ఏకగ్రీవ పంచాయితీ లకు ఇస్తామన్న నిధులు ఇవ్వకుండా సర్పంచులని, గ్రామాల ప్రజల్ని మోసం చేసింది బీఆర్ఎస్ అంటూ నిప్పులు చెరిగారు. సర్పంచులని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. సర్పంచ్ లు చేసే పోరాటానికి బిజెపి పార్టీ మద్దతు ఇస్తామ‌ని వెల్ల‌డించారు. వారిది న్యాయమైన పోరాటం అన్నారు.


కరీంనగర్ లో బీఆర్ఎస్ కి అభ్యర్థికి లేక పక్క జిల్లా నుండి తీసుకువచ్చి పోటి చేపిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కే సీఎం అవుతానని నమ్మకం లేద‌ని, త్వరలో ఎలా సీఎం అవుతాడో కేటీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. తాగి ప్రభుత్వాన్ని నడిపినందుకే కారు షెడ్డు కి పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ కారు షెడ్డు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశాలు లేవ‌న్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement