Thursday, November 28, 2024

BJP – మేం హ‌స్తంతో దోస్తీనా… చిన్న పిల్లొడు కూడా న‌మ్మ‌డు – కెటిఆర్ కు బండి కౌంటర్

మీ మెదడు బ‌ఠాని అంత ఉండ‌టంతోనే మాపై ఆరోప‌ణ‌లు
కెటిఆర్ కు మంత్రి బండి సంజ‌య్ కౌంట‌ర్

హైద‌రాబాద్ – దేశంలో ఎక్కడ కూడా . బీజేపీ, కాంగ్రెస్ లు కలిసి ఉన్నాయని పిల్లవాడు కూడా నమ్మడ‌ని, అయితే బ‌ఠాని ప‌రిణామంలో మెదడు ఉన్న కెటిఆర్ మాత్రం త‌మ పై అవాకులు చెవ‌కులు పేలుతున్నార‌ని మండి ప‌డ్డారు కేంద్ర మంత్రి బండి సంజ‌య్. త‌మ బాస్ ప్రధాని మోడీని కలిసినప్పుడు, ఆయన నిజమైన నాయకత్వంలో బిజెపి పనిచేస్తుందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని కేటీఆర్ తన అసూయతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నార‌ని కౌంట‌ర్ ఇచ్చారు.. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు.

“మీ కేటీఆర్ ట్విట్టర్ మీ పిల్ల చేష్టలకు ధన్యవాదాలు, “కారు” షెడ్లో ఉంది. కానీ ఎవరి “చేతి” కీలను కలిగి ఉందో అందరికీ తెలుస‌న్నారు బండి. కాంగ్రెస్ తో మీ రహస్య బంధం మీ ప్రతి కుంభకోణంలో క‌నిపిస్తున్న‌ద‌న్నారు. ధరణి స్కాం, గొర్రెల కుంభకోణం, కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం, డ్రగ్స్ కేసు, జన్వాడ ఫామ్ హౌస్పై దాడులు, పవర్ పర్చేజ్ ఫ్రొబ్, ఫార్ములా నిధుల కేసు, లంగచెర్ల ప్రమేయం ఇలా అన్ని కేసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని కాపాడుతూనే ఉందంటూ ఆరోపించారు బండి సంజ‌య్. తాము ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచామ‌న్నారు. . ఇలానే కొనసాగుతామ‌న్నారు. మీ అవినీతి, వంచన కూటమి ఎక్కువ కాలం ఉండద‌ని అంటూ . తెలంగాణ నిజమైన పాలన బీజేపీ పార్టీకి అర్హత ఉందని త్వరలోనే సాకారం కాబోతున్న‌ద‌ని పేర్కొన్నారు బండి సంజ‌య్ ..

Advertisement

తాజా వార్తలు

Advertisement